TDP MLA Sandra Venkata Veeraiah arrested in cash-for-vote scam

Tdp mla sandra venkata veeraiah arrested

cash for vote, Telangan ACB, sandra venkata veeraiah, pavan kalyan on cash for vote case, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

Telugu Desam Party MLA from Sathupally Sandra Venkata Veeraiah was on Monday arrested for his alleged involvement in the cash-for-vote case.

ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు

Posted: 07/06/2015 07:24 PM IST
Tdp mla sandra venkata veeraiah arrested

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ పోలీసులు సండ్రను విచారించారు. విచారణలో సరైన సమాధానాలు చెప్పకుండా సహకరించకపోవడంతో సండ్రను అరెస్టు చేసినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అరెస్టయినప్పటి నుంచి సండ్ర తప్పించుకు తిరుగుతున్నారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో చివరకు ఏసీబీ కార్యాలయానికి సండ్ర హాజరయ్యారు.

ఇవాళ ఉదయం నుంచి సుమారు ఏడు గంటల పాటు సాగిన విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు ఏసీబి అధికారులు తెలిపారు. గత నెల 30, 31న రేవంత్‌రెడ్డితో సండ్ర పోన్‌లో మాట్లాడినట్లు ఏసీబీ ఐజీ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి సండ్ర ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే ఈ కేసులో మరో నిందితుడు మత్తయ్యకు ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఓటుకు నోటు కేసులో సండ్ర ఫోన్ సంభాషణల ఆధారంగా ఏసీబీ విచారణ సాగింది. ఎంత మంది ఎమ్మెల్యేలను కొనడానికి ప్లాన్ వేశారు?, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కన్నుంచి తెచ్చారు. అంత పెద్ద మొత్తం ఎవరు సమకూర్చారు వంటి ప్రశ్నలను ఏసీబీ సండ్రపై సంధించినట్లు సమాచారం. ఏసీబీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సండ్ర సరైన సమాధానం ఇవ్వనట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను కస్టడీకి తీసుకుని మరోసారి విచారించాలనే నిర్ణయంతో ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash on vote  Telangan ACB  sandra venkata veeraiah  

Other Articles