pavan kalyan says he is anti in implementing section 8

I am against implementation of section 8 in hyderabad

pavan kalyan says kcr steped first for telugu people reunity, pavan kalyan on cash for vote case, section 8, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

actor turned politician jana sena president,r power star pavan kalyan says he is against implementation of section 8 in hyderabad

హైదరాబాద్ లో సెక్షన్ 8 కు నేను వ్యతిరేకం: పవన్ కల్యాన్

Posted: 07/06/2015 06:10 PM IST
I am against implementation of section 8 in hyderabad

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్‌-8 విధించేందుకు తాను వ్యతిరేకమని సినీనటుడు, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజల మాన ప్రాణాలకు ఏదైనా ఆపద ఏర్పడితే సెక్షన్ 8 దానంతట అదే అమలుకు నోచుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోనే వున్నాయని అన్నారు. రాష్ట్రం విడిపోయింది. ఒకరికి కంట్లో వెన్న పెడితే.. మరోకరి కంట్లో కారం పెట్టినట్లుగా విభజన జరిగిపోయింది. ఇక సెక్షన్ 8 పేరుతో మరోసారి కేంద్రానికి అధికారం కట్టబెట్టిస్తే.. అప్పుడు తెలంగాణ కూడా అన్యాయం చేసిన వాళ్లు అవుతారని, కేంద్రం మరో పెద్ద తప్పు చేసినట్లు అవుతుందన్నారు.

ఉద్యమాల్లో వున్నప్పుడు కేసీఆర్ ఏమైనా మాట్లాడవచ్చు.. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో వున్న ప్రజలందరినీ సమానంగానే చూడాలని పవన్ సూచించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. తెలుగు రాష్ట్రమే విడిపోయింది తప్ప.. మరో దేశంగా విడిపోలేదని, మనమంతా భారతీయులమే.. మనందరిదీ భారత జాతి అనే భావన కల్పించాల్సిన బాధ్యత కేసీఆర్ పై వుందన్నారు. 60 ఏళ్లుగా హైదరాబాద్ ఆంధ్రులకు రాజధాని అందుకే హైదరాబాద్ తో అంతగా అనుబంధముందని పవన్ అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కారించాలని అందుకు గాను పార్లమెంటరీ కమిటీ వేయాలని పవన్ కల్యాన్ సూచించారు. అధికార, విఫక్ష సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి.. వారు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ కమిటీ కూడా పరిష్కరించలేని సమస్యలపై, రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడిన సమయాల్లోనూ కమిటీ నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి పిర్యాదు చేసేలా వుండాలని ఆయన కోరారు. ఇందుకోసం పార్లమెంటరీ కమిటీలో సీనియర్ ఐఎఎస్ అధికారి వుండేలా కూడా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  jenasena  cash on vote  press meet  section 8  hyderabad  

Other Articles