CID | AP | Telangana | Evidence | Jerusalem Mathaiah

Ap cid officers got a evidence about the attack on jerusalem mathaiah

CID, AP, Telangana, Evidence, Jerusalem Mathaiah

Ap CID officers got a evidence about the attack on Jerusalem mathaiah. The CID got evidence on TRS leaders and some hyderabad police attack on jerusalem mathaiah.

మత్తయ్యను బెదిరించింది టిఆర్ఎస్ రౌడీలు..? ఏపి సిఐడి వద్ద ఆధారాలు..!

Posted: 07/06/2015 08:16 AM IST
Ap cid officers got a evidence about the attack on jerusalem mathaiah

ఓటుకు నోటు వ్యవహారంతో ముడిపడిన ప్రతి అంశం సీరియల్ లాగా సాగుతూనే ఉంది. అయితే ఓటుకు నోటు వ్యవహారం తర్వాత ట్యాపింగ్ వివాదం, తర్వాత సెక్షన్ 8 వివాదం ఇలా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం టిఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులు, తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పుల మీద దృష్టిసారించింది. అయితే అందులో భాగంగా తాజాగా ఓటుకు నోటు వ్యవహారంలో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు సంబందించిన వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో స్టీఫెన్ సన్ తో మంతనాలు జరుపుతున్న క్రమంలో మత్తయ్య కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు కొంత మంది పోలీసులు కూడా బెదిరించారు అన్న సమాచారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: మత్తయ్య కాల్ డేటా బయటకు వస్తే దేశ భద్రతకు ముప్పా..?

ఓటుకు నోటు కేసులో ఎ4 నిందితుడు జెరూసలెం మత్తయ్య సోదరుడిపై దాడి చేసింది హైదరాబాద్‌ పోలీసులేనని ఏపీ సీఐడీ పోలీసులు గుర్తించారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకెళ్లాలన్న పోలీసు ఉన్నతాధికారుల సూచనతో సీఐడీ అధికారులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.  అయితే కొందరు వ్యక్తులు... మత్తయ్య ఇంటికెళ్లి మరీ ఆయన భార్యను దుర్భాషలాడి, అతని సోదరుడు ప్రభుదాస్ ను చితకబాదారని సమాచారం. దీనిపై విజయవాడ పోలీసులకు మత్తయ్య ఫిర్యాదు చేశారు. నామినెటెడ్‌ ఎమ్మెల్యే పదవి ఇచ్చేందుకు స్టీఫెన్‌సన్‌ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని వెల్లడిస్తానన్న భయంతో తన సోదరుడు, భార్యపై గుర్తు తెలియని వ్యక్తులతో దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బెజవాడ పోలీసులకు విన్నవించారు. ఘటన జరిగింది హైదరాబాద్‌లో కావడంతో ఏపీ ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మత్తయ్య కుటుంబాన్ని బెదిరించింది హైదరాబాద్‌ సిటీ పోలీసులని గుర్తించారు. మత్తయ్య, ఆయన భార్య, సోదరుడు ప్రభుదాస్‌ నంబర్లకు మే చివరి వారం నుంచి జూన్‌ మొదటి వారం వరకు వచ్చిన కాల్స్‌ డేటాను సీఐడీ అధికారులు సేకరించారు. అందులో కొన్ని నంబర్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పేరుతో ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని అదుపులోకి తీసుకొనేందుకు ఏపీ సీఐడీ సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

Also Read :  అత్తారింట్లో ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CID  AP  Telangana  Evidence  Jerusalem Mathaiah  

Other Articles