US: Facebook pic reunites mum with kidnapped son after 15 years

Facebook reunites mother with son after 15 years

Facebook reunites mother with son after 15 years, Facebook, Facebook reunites family, Facebook reunites mother with son after 15 years, Facebook photo, Hope Holland, Facebook, US, Mother, Son, Kidnapped, Jonathan

In a scene straight from a Bollywood movie, a Facebook photo has helped a Californian woman to reunite with her son after 15 years.

పేగు బంధాన్ని కలిపిన ఫేస్ బుక్..!

Posted: 07/05/2015 05:35 PM IST
Facebook reunites mother with son after 15 years

అచ్చం పాతకాలం బాలీవుడ్ సినిమా కథను తలపించేలాంటి ఘటన ఇది. అయితే ఇది జరిగింది మాత్రం ఇండియాలో కాదు. న్యూయార్క్ లో. ఎక్కడైనా తల్లిప్రేమ తల్లిప్రేమేనని రుజువైంది. తల్లి ప్రేమ కోసం తల్లడిల్లే ఓ కుర్రాడ్ని తల్లి వద్దకు చేర్చింది ఆ ప్రేమ. అయితే ఇక్కడ మాధ్యమంలా దోహదపడింది మాత్రం ఫేస్ బుక్. తల్లి ప్రేమ తప్ప ఒక్క ముక్కా అర్థం కాలేదంటారా..? అయితే ఈ స్టోరి చదవండీ.. చిన్నతనంలో కన్న తండ్రి ద్వారా అపహరణకు గుైన పిల్లాడు.. 15 సంవత్సరాల తరువాత తన తల్లిని కలిశాడు.

కుటుంబంలో వివాదాల కారణంగా జోనాథన్ అనే యువకుడ్ని బాల్యంలోనే తండ్రి కిడ్నాప్ చేశాడు. అతడ్ని మెక్సికోకు తీసుకుపోయాడు. తండ్రి కిడ్నాప్ చేసే సమయానికి జోనాథన్ వయస్సు సరిగ్గా మూడేళ్లు. బాహ్య ప్రపంచ గురించి ఏమీ తెలియని వయస్సులో కిడ్నాప్ గురైన జోనాథన్ మెక్సికోలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే ఏడాది క్రితం అతన్ని చిన్నతంలో అన్నతో కలసి వున్న ఫోటోను ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో అలోచనలో పడ్డ తల్లి హెస్ హాలెండ్ అతను తన బిడ్డగా గుర్తించింది.

తన కొడుకును తిరిగి స్వదేశం అమెరికాకు తెలచ్చుకోవాలని పూనుకుంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అతని కోసం మరింతగా అన్వేషించి ఎట్టకేలకు ఆచూకీ తెలుసుకుంది. ఆ బిడ్డపై ఏనాడో ఆశలు వదులుకున్నామని ,అయితే తిరిగి జోనాథన్ తమను కలవడం నిజంగా అద్భుతమేనని పేర్కోంది. సుదర్ఘమైన నిరీక్షణ ఫలించిందని, పేస్ బుక్ లో ఆ ఫోటో చూశాక తన శ్వాస కూడా అదుపు తప్పించని చెప్పుకోచ్చింది. మొత్తానికి ఫేస్ బుక్ పేగు బంధాన్ని కలపిందన్నమాట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  US  Mother  Son  Kidnapped  

Other Articles