KCR says, will take koppula eswar into cabinet

Koppula eswar yet to get ministry in ts government

koppula eswar yet to get ministry in TS government, KCR says, will take koppula eswar into cabinet, Telangana cabinet, koppula eswar, KCR, cabinet, husnabad, karimnagar

Telangana chief minister KCR says, will take koppula eswar into cabinet

ఈశ్వర్ వ్రతం చెడలేదు.. కానీ ఫలితం దక్కనుంది.. ఎప్పుడో..?

Posted: 07/05/2015 04:47 PM IST
Koppula eswar yet to get ministry in ts government

తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ నేతగా, వరుసగా పలు పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిలో కొప్పుల ఈశ్వర్.. ఒకరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సుసాధ్యమైయ్యాక  తొలిసారిగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి తప్పక దక్కుతుందని ఆశించి భంగపడ్డాడు ఆయన. అయితు కోప్పుల ఈశ్వర్ కు స్పీకర్ పదవిని ఇవ్వాలని ఇవ్వాలని కేసీఆర్ యోచించారు. కాగా ఆయన అందుకు నిరాకరించారు. తనకు ఇస్తే, గిస్తే మంత్రి పదవి ఇవ్వాలని లేదంటే తాను సర్వసాధరణమైన ఎమ్మెల్యేగానే కోనసాగుతానని అప్పటి నుంచి వత్రాన్ని చేపట్టారు.
 
సుమారు ఏడాదిగా అసంతృప్తితో వత్రాన్ని చేపట్టిన ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఇన్నాళ్లుకు వత్రం చెడకుండానే.. ఫలితం దక్కింది. ఇవాళ ఆయన నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆయనకు గుఢ్‌ న్యూస్‌ చెప్పారు. మొదటిగా మంత్రివర్గంలోనే బెర్త్‌ ఆశించిన ఆయనకు ఆ తరువాత కూడా ఎదురైన భంగపాటును ఇన్నాళ్లకు కేసీఆర్ వెల్లడించిన ప్రకటనతో ఆయన శిభిరంలోనూ సంబరాలు విరబూసాయి. అదెలా అంటారా..? కరీంనగర్ జిల్లా పర్యటించిన కేసీఆర్ త్వరలోనే కొప్పుల ఈశ్వర్ ను తన కేబినెట్ లో తీసుకుంటానని చెప్పడమే. దీంతో ఇక కొప్పుల వర్గీయులకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  అయితే ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా..? ఎప్పుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానా..? అని కొప్పుల ఈశ్వర్ ఆశగా కౌంట్ డౌన్ మొదలుపెడుతున్నాడట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koppula eswar  KCR  cabinet  husnabad  karimnagar  

Other Articles