danam lashes out at telangana government

Danam nagender suspects conspiracy in congress party

danam lashes out at telangana government, danam nagender suspects Conspiracy in congress party, Danam Nagender, kcr, congress, seemandhra, GHMC elections, votes, conspiracy, hyderabad ,

danam nagender suspects Conspiracy in rumors that he too is yet to leave congress party,

కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర జరుగుతుంది

Posted: 07/05/2015 03:53 PM IST
Danam nagender suspects conspiracy in congress party

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, మాజీ మంత్రి హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఇంచార్జ్ దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల వెనుక కుట్ర వుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పోమ్మనలేక పోగబెట్టినట్టుగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందేమోనని దానం అనుమానాన్ని వ్యక్తం చేశారు. అపరేష్ ఆకర్ష్ తో విపక్షాలను బలహీన పర్చాలని టీఆర్ఎష్ పార్టీ చూస్తుందని ఆరోపించారు. ఒంటెద్దు పోకడలతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏ గతి పట్టిందో.. కేసీఆర్ కు అదే గతి పడుతుందని చెప్పారు.

స్వచ్ఛహైదరాబాద్‌కు 100 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారని దానం ప్రశ్నించారు. వ్యతిరేకంగా మాట్లాడితే అణదొక్కే ప్రయత్నాలను చేస్తున్నారని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. కేసీఆర్ విషయంలో సీమాంధ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు దానం. హైదారాబాద్ లో సీమాంద్రులకు భద్రత కల్పిస్తామన్నారు. అలాగే సెటిలర్ల ఓట్లు తీసే కార్యక్రమంలో టీఆర్ఎస్ సర్కార్ ఉందని దాన్ని తిప్పికొడుతామన్నారు నాగేందర్. ఎన్నికల మేనిఫెస్టో అరచేతిలో వైకుంటం చూపించిన టీఆర్ఎస్.. ఏడాదిన్నర కావస్తున్న యువకులకు ఉద్యోగాలను కల్పించలేకపోయిందన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam Nagender  kcr  congress  seemandhra  GHMC elections  votes  

Other Articles