Maharastra | Nasik | Kumbhamela | Condoms | AIDS, Aids control society

Condoms lack in the nasik kumbhamela in maharastra

Maharastra, Nasik, Kumbhamela, Condoms, AIDS, Aids control society

Condoms lack in the Nasik Kumbhamela in Maharastra. The Maharashtra State Aids Control Society (MSAC) has expressed fear in the run-up to the Kumbh Mela of unprotected sex and the possible spread of HIV and AIDS because of shortage of condoms.

కుంభమేళాకు కండోమ్ ల కొరత

Posted: 07/04/2015 04:23 PM IST
Condoms lack in the nasik kumbhamela in maharastra

ఎక్కడైనా కుంభమేళా జరుగుతుంది అంటే నీళ్ల కొరత ఉందేమో లేదంటే నిధుల కొరత ఉంది అని వార్తలు చదివి ఉంటాం. కానీ కండోమ్ ల కొరత ఉంది అని వాన్నామా..? కానీ నిజం. తాజాగా నాసిక్ లో నిర్వహించనున్న కుంభమేళాకు కండోమ్ ల కొరత ఉందని, కాబట్టి పక్క రాష్ట్రం నుండి కండోమ్ లను దిగుమతి చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయినా కుంభమేళా జరిగే చోట ఈ గొడవ ఏంటీ అనుకుంటున్నారా..? కానీ నిజానికి నాసిక్ లో మామూలుగా వ్యభిచారం ఎక్కువగా జరుగుతుంది. మరి అలాంటప్పుడు కుంభమేళా లాంటి సమయాల్లో అయితే అడ్డు అదుపు ఉంటుందా.. అందుకే ఎయిడ్స్ కంట్రొల్ సొసైటి వెంటనే కండోమ్స్ ను తెప్పించాలని అని వాదిస్తోంది.

మహారాష్ట్రలో ఈనెల 14వ తేదీ నుంచి నాసిక్ కుంభమేళా వేడుక ప్రారంభంకానుంది. ఈ కుంభమేళాను విజయవంతం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమైవుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. అయితే, కుంభమేళాకు సరిపడ కండోమ్‌లు లేవని మహారాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అంటోంది. ఇదే అంశంపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘కుంభమేళా సమయంలో దాదాపు కోటి మంది నాసిక్‌‌కు వస్తారు. చాలా మంది రెండు నుంచి మూడు రోజులు ఇక్కడే ఉంటారు. వారంతా ప్రొటక్షన్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవీ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇక్కడి ఆసుపత్రులలో కండోమ్‌ల నిల్వ లేదు. అందుకే జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో సంప్రదింపులు జరిపి... అవసరమైన కండోమ్‌లను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, అధికారిక లెక్కల ప్రకారం నాసిక్‌లో 2 వేల మంది మహిళా సెక్స్‌వర్కర్లు, 560 మంది పురుష సెక్స్‌వర్కర్లు, 70 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఇక్కడ సాధారణ రోజుల్లోనే నెలకు 1.5 నుంచి 2 లక్షల వరకు కండోమ్‌లు వినియోగం అవుతాయి. కుంభమేళా సమయంలొ అయితే మరీ ఎక్కువగా అవసరమవుతాయి కాబట్టి ఖచ్చితంగా పక్క రాష్ట్రాల నుండి వీలైనంత త్వరగా కండోమ్ లను తెప్పించాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  Nasik  Kumbhamela  Condoms  AIDS  Aids control society  

Other Articles