KCR | harithaharam | Baboons | Monkeys | KCR Monkey story

The monkeys live together and said revolution zindabad

KCR, harithaharam, Baboons, Monkeys, KCR Monkey story

The monkeys live together and said revolution zindabad KCR told a story about the monkeys story. The monkeys live together and said revolution zindabad In a vilage monkeys are harrasing the peoplpe and the people decided to bring baboons.

కోతులు కలిసి విప్లవం జిందాబాద్ అన్నయంట..!

Posted: 07/04/2015 03:42 PM IST
The monkeys live together and said revolution zindabad

కోతుల కథలు చాలా మంది చెప్పి ఉంటారు. చరిత్రలో కూడా ఎన్నో కోతుల కథలు ఉన్నాయ్. కానీ ఒకరొకరు ఒక్కో స్టైల్ లో చెబుతారు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కథ అదిరిపోయింది. అయినా చెప్పాల్సిన వాళ్లు ఎలా చెప్పాల్నో అలా చెబితే అన్ని అర్థమైనట్లు ఉంది వ్యవహారం. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతో వైభవంగా ప్రారంభించిన హరితహారాన్ని రెండో రోజు కూడా కొనసాగించారు. అయితే రెండో రోజు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అడవుల పెంపకం మీద ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు. చెట్లు నాటాలని సీఎం చెప్పాలా అని ప్ర్రశ్నించారు. చెట్లు నాటితేనే వానలు వస్తాయి. కోతులు, కోనెంగలు వాపస్ పోవాలంటే అడవుల విస్తీర్ణం పెంచాలి. అప్పుడే కోతులు, కోనెంగల వాపస్ సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు ఎవర్నీ అడుక్కునే పరిస్థితి లేదు.. వానలు రమ్మంటే రావాలి. కోతులు పొమ్మంటే పోవాలి. హరితహారం ఒక్కరితో విజయవంతం కాదు.. ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందన్నారు.

అయితే ఇలా హరితహారం గురించి వివరించే క్రమంలో కేసీఆర్ కోతుల కథను వివరించారు. ఓ ఊర్లో చాలా కోతులు ఉన్నాయట.. అయితే కోతులను హనుమంతుడి రూపాలుగా భావించడం వల్ల ఎవరూ కూడా కొట్టరు. మరి అలాంటప్పుడు కోతుల బెడద తప్పించుకోవడానికి కొండముచ్చులను తీసుకువచ్చారట. అయితే కోతులన్నీ ఏకమై ఓ మీటింగ్ పెట్టుకున్నయంట.. అన్నీ కలిసి విప్లవం జిందాబాద్ అనుకున్నయట. తర్వాత మనం వంద మందిమి ఉన్నం.. ఆ కొండముచ్చును తరమలూమా అని అనుకున్నాయట. అలా మొత్తానికి చాలా ఊర్లలో కొండముచ్చులే కోతులను వెళ్లగొడుతున్నాయట. మొత్తానికి కేసీఆర్ చెప్పిన కథతో సభలో నవ్వులు పూసాయి. చివరకు అడవులు బాగా పెంచితే కోతులు అడవులు పోయి.. వర్షాలు కూడా కురుస్తాయి అని వివరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  harithaharam  Baboons  Monkeys  KCR Monkey story  

Other Articles