YCP MLA BhumaNagi reddy arrested

Ysr congress mla arrested for abusing police officers

YSR Congress MLA arrested for abusing police officers, ysrcp bhuma nagireddy, bhuma nagireddy arrest, bhuma nagireddy, bhuma arrest, bumanagi reddy, buma akhila priya, police, arrest, kurnool mlc elections, bumanagi reddy, buma akhila priya, police, arrest, kurnool mlc elections

YSR Congress Party MLA Bhuma Nagireddy was today arrested on charge of abusing police officers in Kurnool district of Andhra Pradesh during MLC elections,

వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టు, ఉద్రిక్తత

Posted: 07/03/2015 10:51 PM IST
Ysr congress mla arrested for abusing police officers

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో డిఎస్పీ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆయనను అరెస్టు చేశారు. భూమా నాగిరెడ్డి పోలీసు అధికారులను దూషించారని అతనిపై 353, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం స్థానిక సంస్థల కోటాకింద కర్నూలు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

ఎన్నికల కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల అఖిల ప్రియతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో అమె వారిపై మండిపడ్డారు. అయితే తన తనయపై పోలీసు అధికారులు నోరుజారిన విషయాన్ని తెలుసుకున్న భూమా నాగిరెడ్డి అక్కడకి వచ్చి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసు అధికారులు అతనిని అదుపులోకి వాహనంలో నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే భూమ నాగిరెగ్గిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించే క్రమంలోస్తానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భూమనను అరెస్టు చేసి తీసుకెళ్లనీయకుండా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు వారిని పక్కకు నెట్టేసి భూమాను తీసుకువెళ్లారు. దీంతో సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bumanagi reddy  buma akhila priya  police  arrest  kurnool mlc elections  

Other Articles