After 'Lord Hanuman', Dog Gets Aadhar Card in Madhya Pradesh

Man arrested for getting aadhaar card for dog

aadhar card, Aadhar Card for dog, Madhya Pradesh, Aadhar Card for Lord Hanuman, dog unique identification card, unique identification card, unique identification card issued to animal, Aadhar card issued to animal, Aadhar Registration Centre supervisor, Bhind district's Umri town, Madhya Pradesh, Azam Khan, Umri Police station

This dog was issued an Aadhar Card by his owner, who also happens to be a supervisor at an Aadhar Registration Centre

హనుమంతుని తరువాత శునకానికి ఆధార్ కార్డు.. వ్యక్తి అరెస్టు

Posted: 07/03/2015 09:45 PM IST
Man arrested for getting aadhaar card for dog

ఆధార్ కార్డులు పొందేందుకు మనుషులే ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వాధికారులు కుక్కలకు మాత్రం ఈజీగా ఆధార్ కార్డు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు జారీ ప్రక్రియలో లోటుపాట్లను తెలిపుతూ ఇప్పటికే ఒకొక్కరు ఒక్కొ రక్కంగా వెలుగులోకి తీసుకోచ్చారు. అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం గతంలో హనుమంతుడికి ఆధార్ కార్డు జారీ చేసిన అధికారులు నాలుక కర్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ శునకానికి ఆధార్ కార్డును జారీ చేశారు. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండి.. మధ్యప్రదేశ్‌లో ఓ కుక్కకు ఆధార్ కార్డు వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లాలో అజంఖాన్ అనే వ్యక్తి తన కుక్కకు టామీ సింగ్ పేరుతో ఆధార్ కార్డు తీసుకున్నాడు. కార్డులో కుక్క ఫోటో, టామీ సింగ్ అనే పేరు.. సన్ ఆఫ్ షేరు సింగ్ అని ఉంది. అంతేకాకుండా.. ఇక నవంబర్ 26, 2009లో ఆ కుక్క పుట్టినట్లు ఆధార్ కార్డులో ఉంది.
 
విషయం తెలుసుకున్న స్థానికులు.. అధికారులపై విమర్శలు, ఆరోఫణలు గుప్పించడంతో.. వారి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అజం ఖాన్‌ను అరెస్ట్ చేశారు. జంతువులు, అనధికార వ్యక్తులకు కూడా ఆధార్ కార్డులు తయారు చేయిస్తున్నాడనే కోణంలో విచారణ సాగిస్తున్న పోలీసులు అతనిపై ఫోర్జరీ కేసును నమోదు చేశారు. అయితే వాస్తవానికి అజంఖాన్ ఉమ్రి అనే ప్రాంతంలో ఉన్న ఆధార్ ఎన్‌ రోల్‌మెంట్ ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడట. ఈ క్రమంలో కుక్కలు, ఇతర జంతవులకు ఖాన్ ఏజెన్సీ కార్డులు తయారు చేస్తున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హనుమంతుడికి ఆధార్ కార్డు రావడానికి కూడా కారణముంది. తాను అనేక పర్యాయాలు దరఖ్యాస్తు చేసుకున్నా.. ఎంతకీ అధికారులు తనకు ఆధార్ కార్డును జారీ చేయకపోవడంతో.. విసుగు చెందిన ఓ వ్యక్తి హనుమంతుడి ఫోటో పెట్టి పవన్ జీ పేరున ఆధార్ కార్డు సంపాదించిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar card  Azam Khan  Bhind district's Umri town  Madhya Pradesh  

Other Articles