Supreme Court Orders Compensation of Rs 1.8 Crore to Chennai Girl in Medical Negligence Case

Blind girl got 1 8 crore compensation from tamilnadu government

Supreme Court Orders Compensation of Rs 1.8 Crore to Chennai Girl in Medical Negligence Case, 1.8 crore compensation, blind girl, tamilnadu government, supreme court, Supreme Court, medical negligence, Chennai, Delhi, medical negligence compensation

The Supreme Court today ordered one of the largest compensations so far in the country in a case of medical negligence - Rs. 1.8 crore.

అంధబాలికకు వరించిన న్యాయం.. తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Posted: 07/02/2015 05:02 PM IST
Blind girl got 1 8 crore compensation from tamilnadu government

చెన్నైలో వినియోగ‌దారుల కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలు చేసిన త‌మిళ‌నాడు ప్రభుత్వానికి 17 రెట్లు ప‌రిహారం చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తే… 1996లో జ‌న్మించిన ఓ బాలిక కంటి చూపు స‌రిగా లేద‌న్న కార‌ణంతో తల్లిదండ్రులు ఆమెను ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి కంటి ప‌రీక్షలు నిర్వహించారు. బాలికకు కంటి చూపు వస్తుందని అక్కడి వైద్యులు పరీక్షల అనంతరం చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆమెకు ప్రీ మెచ్యూరిటీ రెటినోప‌తి శ‌స్త్ర చికిత్స జ‌రిపారు. ఈ ఆప‌రేష‌న్‌లో వైద్యుల నిర్లక్ష్యం కార‌ణంగా ఆ బాలిక‌కు కంటి చూపు పూర్తిగా పోయింది.

వైద్యులు నిర్లక్షంగా వ్యవహరించి.. శస్త్ర చికిత్స చేయడంతో తమ కూతురికి అప్పటి వరకు మసక మసకగా కనబడిన చూసు కాస్తా పూర్తిగా పోయిందని ఆరోపిస్తూ..ఆ బాలిక తండ్రి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.  కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశించిన న్యాయస్థానం ఇరువైపులా వాదనలను విచారించింది. ఆ తరువాత వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అభిప్రాయానాకి వచ్చిన న్యాయస్థానం.. భాధితురాలికి ఐదు లక్షల రూపాయ‌ల‌ నష్టపరిహారం చెల్లించాలని ఆస్పత్రిని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.

అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆ బాలికకు నష్ట పరిహారంగా 1.3 కోట్లు.. వైద్య ఖర్చులకైన మొత్తం 42.8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ బాలిక వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు. మొత్తం ఆ యువ‌తికి త‌మిళ‌నాడు ప్రభుత్వం ఇప్పుడు ప‌రిహారం, వైద్య ఖ‌ర్చుల కింద కోటీ 72 ల‌క్షల 80 వేల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంది. అందుకే పెద్దలు అంటారు.. పోరాడితే పోయేదేమీ లేదని.. ఇప్పటికైనా బోధపడిందా..!

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1.8 crore compensation  blind girl  tamilnadu government  supreme court  

Other Articles