Sushma Swaraj's husband declined lalit modi's job offer

Lalit modi offered me a job but i declined sushma swaraj s husband

bjp party top brass ready to take action against raje, Raje Leaves Delhi Without Meeting BJP Top Brass, rajasthan, cm, vasundhara, raje, leaves, delhi, without, meeting, bjp, top, brass, india, lalit modi, narendra modi, niti aayog, BJP chief Amit Shah, modigate, vasundhara raje, bjp high comand, Narendra modi

A new controversy has erupted over former IPL chief Lalit Modi's alleged offer of a job to external affairs minister Sushma Swaraj's husband.

లలిత్ మోడీ నాకు జాబ్ ఆఫర్ ఇచ్చినా.. తిరస్కరించాను: సుష్మా స్వరాజ్ భర్త

Posted: 07/01/2015 11:16 PM IST
Lalit modi offered me a job but i declined sushma swaraj s husband

మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. లలిత్ మోదీ తనకు ఉద్యోగం ఆఫర్ చేశారని, అయితే దానిని తాను తిరస్కరించానని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ తెలిపారు. ఓ జాతీయ మీడియాకు కౌశల్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను 20 సంవత్సరాలుగా లలిత్ మోదీ కుటుంబ లాయర్‌గా పనిచేస్తున్నానని కౌశల్ తెలిపారు. ఈ క్రమంలో అందుకు ప్రత్యామ్నాయంగా లలిత్ మోదీ 2015, ఏప్రిల్ 24న తనకు ఇండోఫిల్ బోర్డ్‌లో డైరెక్టర్ పదవిని ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అయితే అందుకు తాను సమ్మతించలేదని కౌశల్ తెలిపారు.

మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు సుష్మా స్వరాజ్‌ను టార్గెట్ చేసుకుని విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల మీడియాతో మాట్లాడుతూ లలిత్ మోదీకి, సుష్మా కుటుంబానికి మధ్య సంబందమేంటో మోదీ ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుష్మా స్వరాజ్, లలిత్ మోదీతో ఎన్ని సార్లు భేటీ అయ్యారో దేశ ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalit modi  sushma swaraj  job offer  sushma husband  kaushal  

Other Articles