Delhi, Kejriwal, Power Bill, AAP, BJP

Arvind kejriwals personal power bill not ninty one thousand says aap government

Delhi, Kejriwal, Power Bill, AAP, BJP

Arvind Kejriwals Personal Power Bill not ninty one thousand Says AAP Government Stung by barbs at Delhi Chief Minister Arvind Kejriwal's "Rs. 91,000 electricity bill," the Aam Aadmi Party (AAP) government today came out with an emphatic denial. The government said the bill included charges for a camp office at the Chief Minister's residence at Civil Lines in north Delhi.

కేజ్రీవాల్ కరెంట్ బిల్ 91 వేలు కాదు 15 వేలు మాత్రమే

Posted: 07/01/2015 01:15 PM IST
Arvind kejriwals personal power bill not ninty one thousand says aap government

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్యుత్తు బిల్లుల విషయంలో భాజపా చేస్తున్న విమర్శలపై ఆప్‌ ప్రభుత్వం స్పందించింది. రూ.91,000గా చెబుతున్న ఆ విద్యుత్తు బిల్లు.. కేజ్రీవాల్‌ ఒక్కరిదేకాదని పేర్కొంది. దానిలో సీఏం అతిథుల కార్యాలయం బిల్లు కూడా కలిపి ఉందని తెలిపింది. అతిథుల కోసం ఏర్పాటుచేసిన వివిధ సదుపాయాల విద్యుత్తు బిల్లులు కూడా దానిలో కలిపి ఉన్నాయని వివరించింది. దిల్లీలోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని స్టాఫ్‌ రోడ్‌లో కేజ్రీవాల్‌ అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విద్యుత్తు బిల్లు ప్రతినెలా రూ.15,000 వరకూ వస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో మంగళవారం తెలిపింది. ుుప్రజల సొమ్మును కేజ్రీవాల్‌ తన వ్యక్తిగత సౌకర్యాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆయనకు రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి పేద ప్రజలకు చూపించడానికి. రెండోది సదుపాయాలతో ఉల్లాసంగా గడపడానికి'' అని కేజ్రీవాల్‌పై దిల్లీ భాజపా నేతలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. మొత్తానికి కేజ్రీవాల్ ఇంటి కరెంట్ బిల్లు 91 వేలు కాదు కేవలం 15 వేలు మాత్రమే అని ఆప్ ప్రభుత్వం బిజెపి పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మరి దీనిపై దిల్లీ బిజెపి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Kejriwal  Power Bill  AAP  BJP  

Other Articles