revanth reddy bail document delayed, to release tommarrow

Revanth to release tomarrow

revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

telangana tdp leader, cash for vote row accused revanth reddy may release tommarrow from jail as his bail documents got delayed

బెయిల్ డాక్యూమెంట్స్ లో జాప్యం.. రేపే జైలు నుంచి రేవంత్ విడుదల.?

Posted: 06/30/2015 10:50 PM IST
Revanth to release tomarrow

ఓటుకు నోటు కేసులో నిందితుడు.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల ఇక రేపే (బుధవారం నాడు) విడుదల కానున్నారు. రేవంత్ రెడ్డి బెయిల్ డాక్యూమెంట్లకు సంబంధింది సకాలంలో చర్లపల్లి జైలు అధికారులకు సమర్పించడంతో జాప్యం చోటుచేసుకోవడంతో.. ఆయన ఇవాళ విడుదల అవుతారని ఆసక్తిగా ఎదురుచూసిన ఆయన అభిమానులకు, పార్టీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. కాగా ఆయన రేపు విడుదల కానున్నారు. ఓటుకు నోటు కేసులో ఆయనను బెయిల్‌పై విడుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఆదేశాలను టైపు చేసేటప్పుడు జరిగిన పొరబాట్లతో పాటుగా ష్యూరిటీ, ఏసీబీకి ఆదేశాలివ్వడానికి సంబంధించిన అంశాల్లో సందిగ్ధత వంటివి రేవంత్ విడుదలలో జాప్యానికి దారితీసినట్లు తెలుస్తోంది. ష్యూరిటీలను ఏసీబీ అధికారుల ముందు ప్రవేశపెట్టాలని హైకోర్టు న్యాయమూర్తి బెయిల్‌ ఆర్డర్‌లో పేర్కొనడం, రేవంత్ విడుదలపై ఏసీబీకి నేరుగా ఆదేశాలు లేకపోవడం వంటి కారణాల వల్ల రేపు హైకోర్టులో సవరణ మెమో దాఖలు చేసేందుకు ఆయన లాయర్లు సన్నద్ధమవుతున్నారు. రేవంత్‌ ఈ రోజే విడుదలవుతారన్న ఆశతో ఉదయం నుంచే చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, రేవంత్‌ అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  cash for vote  cherlapally central jail  bail  

Other Articles