Revanth Reddy | Geetha Reddy | Bail | High court | TDP | Cash for vote

Revanth reddy wife geetha reddy said that revanth wont stop his aggressiveness

Revanth Reddy, Geetha Reddy, Bail, High court, TDP, Cash for vote

Revanth Reddy wife Geetha Reddy said that Revanth dont stop his Aggressiveness. Geetha Reddy very happy on hearing the news of her husband, revanth reddy got bail.

ITEMVIDEOS: రేవంత్ రెడ్డి దూకుడు తగ్గదు

Posted: 06/30/2015 01:27 PM IST
Revanth reddy wife geetha reddy said that revanth wont stop his aggressiveness

ఓటుకు నోటు కేసులో రిమాండ్ ను ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు కాకుండా ఏసీబీ, తెలంగాణ అడ్వకేట్ జనరల్ చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా పని చెయ్యలేదు. గతంలో రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసి నిరాశ చెందినా.. మూడో సారి మాత్రం బెయిల్ సాధించారు రేవంత్ రెడ్డి. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని రేవంత్ కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని అందరికి తెలుసు. రాజకీయ కక్షసాధింపుగానే ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఇరికించారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టివేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి బయటకు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: మీసం మెలేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు వార్నింగ్

రేవంత్ రెడ్డికి బెయిల్ వార్త విన్న తర్వాత అతని భార్య గీతారెడ్డి స్పందించారు. తన భర్తకు బెయిల్ దొరకడం ఎంతో సంతోషంగా ఉంది ఆమె తెలిపారు. అయితే తన తండ్రికి బెయిల్ వచ్చిన వార్త వినగానే రేవంత్ కూతురు నైమిషా రెడ్డి ఆనందంలో ఏడ్చేసింది. తల్లి గీతారెడ్డిని పట్టుకొని ఏడ్చేసింది. అయితే రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఏవైనా ఇబ్బందులు కలుగుతాయని అనుకున్నానని, కానీ ఇలా .జరుగతుందని అనుకోలేదని అన్నారు. అలాగే తమ కుటుంబానికి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, పార్టీ శ్రేణులకు గీతారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదలైన తర్వాత దూకుడు మాత్రం తగ్గదని అంటున్నారు గీతారెడ్డి. గతంలో మాదిరిగానే సమస్యల మీద దూకుడుగానే దూసుకెళతారని అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి బెయిల్  రావడంపై రేవంత్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నారు. రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ లో పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

Also Read: తెలంగాణ పులి బిడ్డ రేవంత్ రెడ్డి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Geetha Reddy  Bail  High court  TDP  Cash for vote  

Other Articles