Telangana Camp Office Cancelled All Appointments Of Kcr Because he Is suffering from fever | CM KCR

Telangana cm kcr suffering from fever camp office cancel all appointment

kcr, kcr fever, kcr camp office, kcr news, kcr updates, kcr latest news, kcr fever news, telangana camp office, pranab mukherjee ifthar party, ramzan festival, telangana ministers, trs party ministers

telangana cm kcr suffering from fever camp office cancel all appointment : Telangana Camp Office Cancelled All Appointments Of Kcr Because he Is suffering from fever. Actually today evening he has to attend ifthar party with in which pranab also come. At this situation is he go or not is in suspence.

ఆ బాధతో ‘బిస్తరేసిన’ సీఎం కేసీఆర్..?

Posted: 06/30/2015 10:55 AM IST
Telangana cm kcr suffering from fever camp office cancel all appointment

నిన్నటివరకు హుషారుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ జోరుగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈరోజు (30-06-2015) మాత్రం బిస్తరేసేశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న అన్ని కార్యకలాపాల్ని నిర్వహించుకోవాలని భావించారు కానీ.. అవన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. దీంతో అటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఆందోళనల్లో వున్నట్లు తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది..? కేసీఆర్ బిస్తరేయడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా!

అసలు విషయం ఏమిటంటే.. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంగా బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో.. గతంలో ఆయన ఇచ్చిన అపాయింటుమెంట్లన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ విశ్రాంతిలో వున్నారని వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందుకు ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా కేసీఆర్ రెస్ట్ తీసుకోకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈయన ఒక్కసారిగా జ్వరం బారిన పడటంతో టీఆర్ఎస్ మంత్రులు ఆందోళనల్లో మునిగినట్లు సమాచారం!

కాగా.. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుకు కేసీఆర్ హాజరు కావాల్సి వుంది. అయితే.. ఆయన జ్వరం బారిన పడటంతో అన్ని అపాయింటుమెంట్లన్నీ రద్దు చేసేశారు కాబట్టి.. కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారా? ఆ విందుకు హాజరవుతారా? లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. అయితే.. ఆయన ఆ విందుకు చాలావరకు హాజరయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  trs party  pranab mukherjee  ifthar party  

Other Articles