Tapping | ap | Telangana | J.V.Rayudu | SIT

Ap govt moving to steps forward on phone tapping

Tapping, ap, Telangana, J.V.Rayudu, SIT

Ap govt moving to steps forward on phone tapping. Ap govt aganist the telangana govt and some top most officers. Ap dgp J.V.Rayudu and SIT officers met to discuss on Tapping issue.

ట్యాపింగ్ పై ఏపి ఇక దూకుడు

Posted: 06/30/2015 07:56 AM IST
Ap govt moving to steps forward on phone tapping

ట్యాపింగ్ వ్యవహారంపై ఏపి ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు, కీలక అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఏపి ప్రభుత్వం వద్ద సమాచారం. అయితే తెలంగాణ సర్కార్ దూకుడును నిలువరించేందుకు ఏపి ప్రభుత్వం కూడా దూకుడు పెంచింది. ట్యాపింగ్ వివాదంపై నమోదైన అన్ని కేసులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే కాకుండా సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ హస్తంపై పక్కా ఆధారాలు లభించినట్లు, ఇక ముందుకు ఎలా సాగాలని సిట్ అధికారులు ఏపి డిజిపి జేవీ రాయుడుతో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది సర్వీస్ ప్రొవైడర్లను విచారించిన ఏపి సిట్ అధికారులు తగిన సాక్షాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది.

ట్యాపింగ్‌పై మొత్తం 88 కేసులు నమోదయ్యాయని. వీటిలో కొన్నింటికి ఆధారాలు లభించినట్లు సిట్ అధికారులు ఏపి డిజిపికి తెలిపినట్లు సామాచారం. ఆ నెంబర్లకు సంబంధించిన వ్యక్తుల వాంగ్మూలాలు మాత్రమే నమోదు చేయాలా? మరిన్ని అనుమానిత నెంబర్లను వాడుతున్న వారి వాంగ్మూలాలూ తీసుకోవాలా? అని డీజీపీని అడిగినట్లు తెలిసింది. ఇది టెక్నాలజీతో ముడిపడింది కావడంతో... కోర్టులో నిలబడేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా దర్యాప్తులో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రాముడు సూచించినట్లు సమాచారం. ఈ కేసులో ముగ్గురు తెలంగాణ ప్రాంత ఐపీఎస్‌ అధికారులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సిట్‌ అధికారులు డీజీపీకి వివరించినట్లు తెలిసింది. అంతేగాక, తెలంగాణ పోలీసులు ఇప్పటికే కొంత సమచారాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం అందింది. సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి అధికారికంగా ఆధారాలు లభించిన తర్వాత దూకుడుగా వ్యవహరించాలని డీజీపీతో జరిగిన సమావేశంలో సిట్‌ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapping  ap  Telangana  J.V.Rayudu  SIT  

Other Articles