KCR, Formationday, telangana, Regularisation, Contract

On telangana formation day telangana cm kcr speech didnt impress telangana people

KCR, Formationday, telangana, Regularisation, Contract

On telangana formation day telangana cm kcr speech didnt impress telangana people. telangana people expect new schemes and new projects on gormation day ceremony. But kcr did reveal any new project.

కేసీఆర్ గురించి.. ఏమో అనుకున్నాం.. ఏమో అయింది

Posted: 06/02/2015 11:34 AM IST
On telangana formation day telangana cm kcr speech didnt impress telangana people

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడాది పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు చూసిన వాళ్లు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా తెలంగాణ పది జిల్లాల్లో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం  ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్ లో జెండా వందనం నిర్వహించారు. తర్వాత స్పీచ్ మొదలుపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాల గురించి వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలకు రూ. 28 వేల కోట్లు కేటాయించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని కేసీఆర్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తోంది అని వెల్లడించారు. ఇక రైతులకు రుణమాఫీ, మహిళల భద్రతకు షీ టీమ్స్, లాంటి వాటి గురించి వివరించారు. అయితే అందరు ఊహించినట్లుగా కేసీఆర్ కొత్తగా ఏమీ మాట్లాడలేదు. కనీసం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారు అని ఎంతో ఆశలు పెట్టుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు అసలు విషయమే అర్థం కాలేదు. ఏం జరిగిందో కూడా తెలుసుకునేలోపే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జై తెలంగాణ అంటూ స్పీచ్ ముగించేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Formationday  telangana  Regularisation  Contract  

Other Articles