Telangana, Chandrababu, TDP, Navanirmanadeksha

Narachandrababu statements likely to oppose the telangana

Telangana, Chandrababu, TDP, Navanirmanadeksha

Narachandrababu statements likely to oppose the telangana. In navanirmana deksha, chandrababunaidu praise the leaders who place key role in samaikya andhra protest.

చంద్రబాబు ఆ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకమేనా..?

Posted: 06/02/2015 11:08 AM IST
Narachandrababu statements likely to oppose the telangana

నారా చంద్రబాబు నాయుడు ఏపిలొ చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో మాట్లాడారు. అయితే నవ నిర్మాణ దీక్షలో మాట్లాడిన నారా చంద్రబాబు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన విధానం అస్సలు బాగోలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ఏర్పాటు ఇలా ఎన్నడూ జరగలేదని అన్నారు. రాష్ట్రాన్ని విభజించదలచుకుంటే ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమని యూపీఏ సర్కార్కు విజ్ఞప్తి చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తెలిపారు. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం ఏక పక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన ఆరోపించారు. మంగళవారం బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రసంగించారు. ఓట్లు కావాలని.. సీట్లు గెలవాలని సోనియాగాంధీ భావించారు. అందుకోసమే హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి... ఆ నివేదికను పక్కన పెట్టి మరీ రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. సోనియా గాంధీకి డబ్బుపై మమకారం ఎక్కువని... అందుకే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు.

ముందు నుండి టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నట్లు నవ నిర్మాణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగానే సాగుతుందా అన్న అనుమానాలు కలుగక మానవు. తెలంగాణ ఏర్పాటు వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న కీలక నేతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చంద్రబాబు ఇలా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినట్లు మాట్లాడటమే కాకుండా.. సమైక్యాంధ్ర ఉద్యామన్ని నడిపిన వారిని సన్మానించడం తెలంగాణకు వ్యతిరేకం అన్న సిగ్నల్స్ పంపినట్లు కాదా అని కొందరు తెలంగాణ వాదులు అంటున్నారు. అయినా సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక నేతలకు సన్మానం చెయ్యాల్సిన అవసరం ఏంటీ అని వారు ప్రశ్నిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Chandrababu  TDP  Navanirmanadeksha  

Other Articles