R.Krishniah, TDP, Chandrababu, MLC, Elections

Telangana telugudesamparty facing new problem as r krishnaiah

R.Krishniah, TDP, Chandrababu, MLC, Elections

Telangana telugudesamparty facing new problem as R.Krishnaiah. The LBNagar Mla R.Krishniah mainatining distance from the TDP since last one year.

కృష్ణ.. కృష్ణ.. తెలుగుదేశానికి అదో తలనొప్పా..?

Posted: 06/02/2015 09:46 AM IST
Telangana telugudesamparty facing new problem as r krishnaiah

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గత కొంత కాలంగా గడ్డుకాలం నడుస్తోంది. టిఆర్ఎస్ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ వల్ల తెలుగుదేశం పార్టీలో చాలా బెర్తులు ఖాళీ అయ్యాయి. అయితే కనీసం ఉన్న బెర్తులన్నా పక్కాగా ఉంటాయా అంటే అదీ లేదాయె. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోపాటు, బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యాలని నిర్ణయించాయి. దాంతో అటు టిడిపి నేతలు, ఇటు బిజెపి నాయకులు ఎమ్మెల్సీ పోలింగ్ కు వచ్చారు. అయితే అందరిలోకి ఆర్.కృష్ణయ్య పంథా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటం లేదు. తాజా ఎమ్మెల్సీ పోలింగ్ లో తన ఓటును నోటాకు వెయ్యడంతో కృష్ణయ్య ఓటు చెల్లుబాటు కాలేదు. దాంతో మరోసారి తెలుగుదేశం పార్టీలో ఆర్.కృష్ణయ్య ప్రస్తావన వచ్చింది. తెలంగాణలో బిసి కులాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామంటు గతంలో ఆర్.కృష్ణయ్య ను తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.

కానీ ఆర్.కృష్ణయ్య మాత్రం వేరే ఆలోచనలో లేరు. ముందు నుండి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆర్.కృష్ణయ్య తాజాగా తన ఓటును నోటాకు వెయ్యడం గమనార్హం. అయితే మొదటినుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు ఆర్ కృష్ణయ్య. ఆయన తన మొదటి ప్రాధాన్య ఓటను నోటాకు వేశారు. దీంతో ఆయన కావాలనే అలా వేశారా?. అసలు ఆయన టీడీపీలో ఉంటారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆయన దారెటు అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. నోటాకు ఓటు వేయడం అంటే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడమేనని చెప్పుకుంటున్నారు. మరి ఆర్.కృష్ణయ్య వ్యవహారంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R.Krishniah  TDP  Chandrababu  MLC  Elections  

Other Articles