TRS, Double offer, celebrations, MLC, Formationday, RevanthReddy

Trs party got double bonanja in this mlc elections

TRS, Double offer, celebrations, MLC, Formationday, RevanthReddy

TRS party got double bonanja in this mlc elections. TRS bagged five mlcs in the elections and TDP leader Revanth Reddy arrested by poloce in the case.

టిఆర్ఎస్ వాళ్లకు రెండు లడ్డూలు

Posted: 06/02/2015 07:54 AM IST
Trs party got double bonanja in this mlc elections

టివీల్లో ఓ యాడ్ తరుచూ చూస్తుంటాం. ఓ చాక్లెట్ కు సంబందింన ఆ యాడ్ లో ఏం నాయనా లడ్డూ కావాలా..? మరో లడ్డూ కావాలా నాయనా..? అంటూ వస్తుంది. అచ్చం అలానే తెలంగాణలో టిఆర్ఎస్ నేతలకు లడ్డూల మీద లడ్డూలు వచ్చాయి. అవును లడ్డూలు ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారా..? అదేం కాదు టిఆర్ఎస్ నాయకులకు స్వీట్ న్యూస్ ఒకదాపి వెంట మరోకటి క్యు కట్టాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో టిఆర్ఎస్ శ్రేణులు తెగ సంబరపడ్డాయి. తెలంగాణ సర్కార్ లక్ష్యంగా గత కొంత కాలంగా తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి వ్యవహారం సాక్షాలతో సహా బట్టబయలు కావడంతో సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. తమ అతినేతను మాటల తూటాలతో ఇబ్బందులకు గురిచేసిన తెలుగుదేశం పార్టీ కీలక నేత రేంవత్ రెడ్డి అరెస్టుతో టిఆర్ఎస్ సంబరాలు చేసుకుంది.

ఇక తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాలను గెలుచుకోవడంతో టిఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఎంతో నాటకీయ పరిస్థితుల నడుమ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందారు. దాంతో డబుల్ ధమాకా చేసుకున్నారు టిఆర్ఎస్ శ్రేణులు. ముందు నుండి అనుకుంటున్నట్లు నాలుగు ఎమ్మెల్సీ స్థానాల గెలుపు ఖాయంగా ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానం మీద కాస్త నీలినీడలు  ఉండేవి. కానీ బిజెపి పార్టీ ఓట్లకు మొత్తానికి చెల్లకుండాపోవడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నోటాకు ఓటు వెయ్యడం, అలాగే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి పొరపాటులేకుండా ఓటును వినియోగించుకోవడంతో ఐదో ఎమ్మెల్సీ కూడా ఖాయమైంది. దానికి తోడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూడా ప్రారంభం కావడంతో ఫుల్ హ్యాపీస్ అంటున్నారు టిఆర్ఎస్ నాయకులు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Double offer  celebrations  MLC  Formationday  RevanthReddy  

Other Articles