MLC, Resluts, TDP, TRS, Congress

Mlc elections results out just now

MLC, Resluts, TDP, TRS, Congress

MLC elections results out just now. Total seven members contest for six mlc seats. TRS bagged five mlc seats in this elections

ఎమ్మెల్సీల ఫలితాలు విడుదల.. సంబరాల్లో టిఆర్ఎస్ శ్రేణులు

Posted: 06/01/2015 07:12 PM IST
Mlc elections results out just now

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఆరు స్థానాలకు గాను ఐదు స్థానాలు టిఆర్ఎస్ సొంతం చేసుకుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అయితే హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అన్ని పార్టీలు తమశక్తిని వడ్డాయి. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావ్, కె.యాదవ రెడ్డి, నీతి విద్యాసాగర్ రావ్, బి.వెంకటేశ్వర్లు ఇక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో నిలిచిన వేం నరేందర్ కు పరాభవమే ఎదురైంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత కూడా గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కిస్తు రేవంత్ రెడ్డి యాభై లక్షల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఊపేసింది.

మొత్తానికి తాడోపేడో అన్నట్లు సాగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ముందు నుండి ఊహిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నాలుగు ఎమ్మలసీ స్థానాలను చాలా ఈజీగా సొంతం చేసుకున్నా.. ఐదవ ఎమ్మెల్సీ పైనే ఉత్కంటత నెలకొని ఉండింది. కానీ ఎన్నికల ఫలితాలు అందరి ఉత్కంటతకు తెర దించాయి. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు టిఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC  Resluts  TDP  TRS  Congress  

Other Articles