Railways to hike AC class fares by 0.5 pc from June 1

Rail fares freight charges to rise from 1 june

Railways to hike AC class fares by 0.5 pc from June 1, Rail fares, freight charges to rise from 1 June, AC Class Fares, Railways, Railway fare hike, Railway fares, Railway AC fare, railways Indian Railways fare hike AC class

Fares for first class and AC class in passenger trains besides freight charges will be increased by 0.5% from June 1 as new service tax will come into effect.

ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టిక్కెట్ల ధరలకు రెక్కలు

Posted: 05/30/2015 08:50 PM IST
Rail fares freight charges to rise from 1 june

భారతీయ రైల్వేలు ప్రయాణికుల టిక్కెట్ ధరలను పెంచనున్నాయి. అయితే ఈ పెంపు మాత్రం కేవలం ఏసీ, ఫస్ట్ క్లాస్ ప్రయాణాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి రైల్వే టిక్కెట్ల పెంపు ధరలు అమల్లోకి రానున్నాయి. భారతీయి రైల్వేలు తమ ప్రయాణికులకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో అవి కూడా సేవా పన్నును వసూలు చేస్తున్నాయి. అయితే గతంలో వున్న సర్వీసు పన్ను కన్నా ఈ ఏడాది జూన్ 1 నుంచి  సర్వీసు టాక్స్ను 0.5 శాతం మేర పెంచనున్నారు. దీంతో ఏసీ ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ధరలు స్వల్పంగా పెరగనున్నాయి.

ఏసీ, పస్ట్ క్లాస్ టిక్కెట్ల ధరలతో పాటు అన్ని రకాల సరుకుల రవాణపై కూడా పెంపు భారం పడనుంది. ఏసీ, ఫస్ట్ క్లాస్ టిక్కెట్లపై సర్వీసు ఛార్జీలు ప్రస్తుతం 3.708 శాతం ఉండగా, 1వ తేదీ నుంచి 4.2 శాతం మేర వసూలు చేయనున్నట్టు సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఉదాహరణకు 1000 రూపాయల ఏసీ టిక్కెట్టుపై అదనంగా 10 రూపాయలు ఛార్జీ వేయనున్నారు. కాగా ఇతర తరగతుల టిక్కెట్ల ధరలు యధాతథంగా ఉంటాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  fares hike  June 1  Indian Railways  AC class  

Other Articles