Telanagana | MLC | MLA | KCR | Elections | Vote

Telangana cm kcr fire on trs mlas for mlc election voting

Telanagana, MLC, MLA, KCR, Elections, Vote

Telangana cm kcr fire on trs mlas for mlc election voting. KCR warn to vote first priority vote to TRS mlcs only. He instruct the mlas to vote as per party.

కేసీఆర్ క్లాస్ చాలా హాటు గురూ

Posted: 05/30/2015 08:04 AM IST
Telangana cm kcr fire on trs mlas for mlc election voting

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోపం గురించి అందరికి తెలుసు. ముక్కు మీదే కోపం ఉంటుంది. కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టరు ఆయన. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటాలో జూన్‌ ఒకటిన జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించిన కేసీఆర్.. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైనా తిక్కతిక్కగా ప్రవర్తిస్తే ఊరుకోను... నాకు ఓటు వేయడం రాలేదు...ఆందోళనకు గురయ్యాను... అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరికి వేయాలో అర్థంగాక తికమ కపడ్డాను... చెయ్యి వణికింది... పెన్ను జారింది... కండ్లు కనపడలేదు.. వంటి చీప్‌ట్రిక్స్‌ చేసినా సహించబోను అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. జ్వరం వచ్చింది... కారు పాడైంది... ట్రాఫిక్‌ జామ్‌ అయింది... మా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు... సిల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా అంతే సంగతులు. ఎవరికి ఓటు వేయడం రాదో, వచ్చో నాకు తెలుసని కేసీఆర్ అన్నారు.

ఎవరూ చిన్న పిల్లలు కాదు. పోటీలో ఉన్న ఐదుగురు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు చిన్న డ్యామేజ్‌ జరిగినా.. నేను అసలుకే మెంటల్‌ వాడ్ని నా సంగతి మీ అందరికీ తెలుసు. అసెంబ్లీని రద్దు చేయడానికైనా వెనుకాడను. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు గెలవాలి. ఎవరికి ఎవరు ఓటు వేయాలో స్లిప్‌లు అందజేస్తాం. దాని ప్రకారం ఓటు వేయడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరికీ ఓటు వేయడం తెలుసు. ఓటు వేయ డం రాకపోతే నేర్చు కోండి. పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయడానికి వీల్లేదు.' అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేసినట్లు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలను కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఎమ్మెల్యేలకు గట్టి క్లాస్ తీసుకున్నారు ఆయన. అయితే ఎవరు ఏదైనా పొరపాటు చేసినా.. తాను మాత్రం చూస్తూకూర్చోనని తేల్చేసాడు. మరి ఎన్నికల ఫలితాల తర్వాత అసలు విషయం అర్థమవుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana  MLC  MLA  KCR  Elections  Vote  

Other Articles