Actress Madhuri Dixit gets FDA notice for endorsing Maggi Noodle Controversy | Bollywood News

Madhuri dixit gets fda notice for endorsing maggi noodles

Madhuri Dixit, Maggi noodles, madhuri maggi controversy, maggi noodles controversy, madhuri fda notice, fda notice to madhuri, madhuri hot photos, madhuri with husband, madhuri children, madhuri maggi advertisement

Madhuri Dixit gets FDA notice for endorsing Maggi Noodles : Actor Madhuri Dixit has been sent notice for endorsing Maggi noodles, which is under scrutiny for high content of lead and monosodium glutamate.

నటి మాధురికీ ‘నోటీసుల’ తంటాలు తెచ్చిన ‘మ్యాగీ’

Posted: 05/29/2015 04:42 PM IST
Madhuri dixit gets fda notice for endorsing maggi noodles

ఇదేంటి..? నటి మాధురీకి, ‘మ్యాగీ’కి సంబంధం ఏంటి? దాని తరఫున ఈమెకి నోటీసులు రావడమేంటి? ఇంతకీ మాధురీ ఏం చేసింది? అసలీ మొత్తం వ్యవహారమేంటి? అనే సందేహాలు టైటిల్ ని చూసి వెలువడుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ చిక్కుముడులు విడవడాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇటీవలే ఉత్తరప్రదేశ్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జరిపించిన పరీక్షల్లో ‘మ్యాగీ’ న్యూడిల్స్ లో హానికరమైన రసాయనాలు వున్నట్లు తేలిన విషయం తెలిసిందే! దీంతో యూపీలో మ్యాగీ అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాదు.. దేశవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం కూడా విధించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. మ్యాగీ అమ్మయాలు నిలిచిపోవడానికి మాధురీకి సంబంధం ఏంటి? అని భావిస్తున్నారా?

ఆ వివరాల్లోకి వెళ్తే.. మాధురీ ‘టూ మినట్స్ నూడుల్స్’ పేరుతో వచ్చిన మ్యాగీ వాణిజ్య ప్రకటనలో నటించింది. టీవీల్లో ప్రసారమవుతో్న్న ‘రెండు నిమిషాల్లో నూడుల్స్’ అనే ప్రకటనలో మాధురీ దీక్షిత్.. ‘అలసిపోయిన పిల్లలు మ్యాగీ నూడుల్స్ తింటే ఇట్టే శక్తి వస్తుంది. నేను తినిపిస్తున్నాను. మీరూ తినిపించండి’ అని అంటుంది. ఈ ప్రకటనే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ ప్రకటనలో ఆమె చెప్పినట్లుగా నూడుల్స్లో న్యూట్రిషన్ విలువలన్నాయన్న మాటలను  ఏవిధంగా నిరూపిస్తారో చెప్పాల్సిందిగా హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం మాధురీ దీక్షిత్ కు నోటీసులు జారీచేసింది.

15 రోజుల్లోగా సంతృప్తికరమైన సమాధానం చెప్పకుంటే కేసు నమోదు చేస్తామని ఫుడ్ సెక్యూరిటీ అధికారి మహిమానంద్ జోషి తెలిపారు. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి రావడంతో ఒక బ్యాచ్ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా మాధురీకి నోటీసులు జారీ చేయడాన్ని చూస్తుంటే.. ప్రకటనల్లో నటించేటప్పుడు పారితోషికమే కాదు సదరు ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా.. చెడు చేసేదా అనే విషయాలపై నటీనటులు ఇకనైనా దృష్టిసారించాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ఇకనుంచైనా నటీనటులు ఆమేరకే జాగ్రత్తలు తీసుకుంటారేమో వేచి చూద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhuri dixit  maggi noodles  bollywood  

Other Articles