A Vijayawada Girl Gangraped by 15 Members in Medak District | Crime News

Vijayawada girl raped by 15 members medak district residency

vijayawada girl rape, medak gangrape case, vijayawada girl gangrape news, medak district gangrape, medak police members

Vijayawada Girl Raped by 15 Members Medak District Residency : A couple bring a girl from vijayawada by saying they will show a job for her. But the girl was gangraped by 15 members where the couple kept her in residency.

ఉద్యోగం ఇప్పిస్తామంటూ.. యువతిపై 15మంది గ్యాంగ్ రేప్

Posted: 05/29/2015 12:34 PM IST
Vijayawada girl raped by 15 members medak district residency

‘మనం బాగుంటే చాలు.. మిగతావాళ్లు నాశనమైపోయిన ఫర్వాలేదు’. ఈ విధంగా స్వభావం కలిగిన వ్యక్తులు కోకొల్లలు. తమ సౌలభ్యం ఇతర జీవితాలతో ఆడుకోవడం ఇటువంటివారి అలవాటు. డబ్బులకోసం మానవత్వాన్ని మరిచి.. ఇతరులపై తమ పైశాచికాన్ని ప్రదర్శిస్తారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన నిలుస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువతికి ఆశ చూపిన ఓ జంట.. ఆమెను 15 మంది మృగాళ్ల చేతిలో బలయ్యేలా చేసింది. ఈ ఉదంతం మెదక్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన ఓ యువతిని ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశచూపించి దుబ్బాకకు చెందిన దంపతులు సిద్దిపేటకు తీసుకువచ్చారు. తర్వాత ఆమెను సిద్దిపేటలోని హరహర రెసిడెన్సీలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంచారు. మూడురోజుల పాటు అందులోనే ఉంచి ఉద్యోగం ఇంకా ఎక్కడా దొరకలేదని, ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే.. ఆ రెసిడెన్సీలోనే ఆమెపై 15 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువతిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు.

ఉద్యోగం పేరుతో విజయవాడ నుంచి ఆమెను రప్పించిన దంపతులు వ్యభిచారాన్ని వ్యాపారంగా నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విధంగా ఇంకా ఎంతమంది మహిళలు ఈ దంపతుల మాయమాటలు నమ్మి మోసపోయారోనన్న కోణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada girl news  medak gangrape news  

Other Articles