Rajyavardhan Singh Rathore Talks About ABN andhrajyothy News Channel Ban | TRS Govt

Rajyavardhan singh rathore interview abn news channel ban

rajyavardhan singh rathore, abn andhrajyothy, andhra jyothy news channel ban, abn news channel ban news, abn ban news, radha krishna

Rajyavardhan Singh Rathore Interview ABN News Channel Ban : Rajyavardhan Singh Rathore says that this is not good to ban a news channel in their own state.

ఛానెల్ నచ్చకపోతే.. ప్రసారాలు నిలిపివేయాలా?

Posted: 05/29/2015 11:15 AM IST
Rajyavardhan singh rathore interview abn news channel ban

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా, అసభ్యకరంగా వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ టీడీ9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారాలను నిలిపివేసిన సంగి తెలిసిందే! అయితే.. ఈ రెండింటిలో తిరిగి టీవీ9 ప్రసారాలు మొదలయ్యాయి కానీ.. ఏబీఎన్ ప్రసారాలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. ఈ న్యూస్ ఛానెల్ ప్రసారాల్ని తిరిగి ప్రారంభించాలని ఛానెల్ యాజమాన్యంతోపాటు ఎందరో మంత్రులు కోరినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఏబీఎన్ న్యూస్ ఛానెల్ పై తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ఈ వ్యవహారంపై స్పందించారు.

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానెల్‌ ప్రసారాల నిలిపివేత సరైన చర్య కాదంటూ ఆయన స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో స్థానిక చానెల్‌ ప్రసారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే.. దాని ప్రసారాలను నిలిపి వేయడానికి వీల్లేదని అన్నారు. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేసిందని వివరించారు. బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఓ విలేకరి తెలంగాణలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రసారాలను నిలిపివేసిన విషయంపై రాథోడ్ ను ప్రశ్నించారు. ఆ న్యూస్ ఛానెల్ ప్రసారాలను నిలిపివేసి ఏడాది అవుతోందని, తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి హోదాలో వచ్చిన ప్రకాశ్‌ జవదేకర్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా, ‘రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తారం’టూ సమాధానమిచ్చారని, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదని ఓ విలేకరి ప్రశ్నించారు.

ఈ విధంగా ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు రాథోడ్ సమాధానం చెబుతూ.. ‘నాకు తెలిసి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి అంశం కోర్టు పరిధిలో ఉంది. నిజానికి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపి వేయడం సరైన చర్య కాదు. ఇలాంటి చర్యలను కేంద్రం సమర్థించబోదు’ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఏబీఎన్ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించే అంశంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఈ చానెల్ పై ఇంకా ఎన్నాళ్లవరకు ఇలా సంకెళ్లు కొనసాగుతాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajyavardhan singh rathore  abn andhrajyothy  trs govt  

Other Articles