Ex Model Priyanka Singh and her friend anju gets Life Imprisonment for Killing Parents | crime news

Ex model priyanka singh friend anju gets life imprisonment for killing parents

priyanka singh, ex model priyanka singh, priyanka friend anju news, priyanka singh jail sentence, priyanka singh crime news, priyanka singh murder case, meerut court news, meerut court photos, priyanka singh updates

Ex Model Priyanka Singh friend anju get Life Imprisonment for Killing Parents : An ex-model and her friend have been sentenced to life in prison by a district court here which held them guilty of murdering the former's parents in 2008.

తల్లిదండ్రులను హత్యచేసిన కేసులో ఆ మోడల్ కు జీవితఖైదు

Posted: 05/29/2015 09:50 AM IST
Ex model priyanka singh friend anju gets life imprisonment for killing parents

మోడల్ ప్రియాంకా సింగ్.. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోదామని ఎన్నో కలలు కన్నది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుని సరికొత్త రంగుల ప్రపంచంలో విహరిద్దామని ఎంతో ఆశించింది. ఇందుకు తన కుటుంబసభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు సహాయసహకారాలు అందిస్తారని భావించింది. కానీ.. ఈమె అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. తాను ఆశించిన ఆశలు ఫలించకపోవడంతో మానసిక వేదనతో కుమిలిపోయేది. తన పేరెంట్స్ సైతం తన గురించి అంతగా పట్టించుకోకపోవడం ఆమెకి మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. అంతే.. కన్నవారని చూడకుండా అత్యంత విచక్షణారహితంగా చంపేసింది. దీంతో ఆమెకు జీవితఖైదు శిక్ష తప్పలేదు.

వివరాల్లోకి వెళ్తే.. 2008 నవంబర్ 11వ తేదీన మోడల్ ప్రియాంకా సింగ్ తన స్నేహితురాలైన అంజూతో సహాయంతో తన తల్లిదండ్రులైన ప్రేమ్ వీర్ సింగ్, సంతోష్ సింగ్ లను కత్తితో పొడిచి దారుణంగా చంపేసింది. అనంతరం తనకు ఏమీ తెలియదన్నట్లుగా పోలీసులకు కొన్నాళ్లు ఆటపట్టించింది. అయితే.. వారు తమదైన రీతిలో విచారణ చేపట్టగా.. ఈ హత్య చేసింది ప్రియాంకానేని తెలిసింది. కన్నవారినే చంపాల్సినంత పరిస్థితి ఎందుకొచ్చిందని ఆమెను అడిగితే.. నిత్యం ఆస్తి తగాదాలు పెట్టుకుంటూ తనని సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ వచ్చిన ఈ కేసు విచారణ ఇంతటితో ముగిసింది.

ఈ హత్యకేసులో మోడల్ ప్రియాంకాను మీరట్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే ప్రియాంకతోపాటు ఆమెకు సహకరించిన అంజూకు సైతం జీవిత ఖైదు పడింది. ఇద్దరూ చెరో రూ.25 వేలు జరిమానా కట్టాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ex model priyanka singh  friend anju  meerut court  murder case  

Other Articles