TDP, Chandrababu, Bharataratna, Mahanadu, Motion

Telugusesamparty passed a motion to give bharataratna for ntr

TDP, Chandrababu, Bharataratna, Mahanadu, Motion

Telugusesamparty passed a motion to give Bharataratna for NTR. Narachandrababu Naidu told that the party unanimously passed the motion in the mahanadu.

ITEMVIDEOS: ఎన్టీఆర్ కు బారతరత్న ఇవ్వాల్సిందే

Posted: 05/28/2015 04:28 PM IST
Telugusesamparty passed a motion to give bharataratna for ntr

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని టిడిపి పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు మహానాడులో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్మృతులను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ చీర ధోవతి కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. రూ.400 కోట్లతో ఎన్టీఆర్‌ చీర ధోవతి కార్యక్రమాన్ని చేపడతామన్న బాబు వీలైతే దసరాకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలు కొత్త బట్టలు కట్టుకునే అవకాశం వస్తుందన్నారు.  శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని గోదావరి తీరంలో పెట్టాలని మహానాడు తీర్మానించింది. చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది.
 

రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని..  1983లో ఆహారభద్రతను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. వ్యవసాయరంగంలో విప్లవం తీసుకువచ్చారని, ఎన్టీఆర్‌ పరిపాలన సంక్షేమానికి మారు పేరు అని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసేతర పార్టీలను ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని వెల్లడించారు.  రాయలసీమలో కరువు వస్తే జోలె పట్టి డబ్బు వసూలు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చంద్రబాబు చెప్పారు. కష్టపడటం ఎలాగో ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాలకు కొత్త అర్ధమిచ్చిన ప్రజానాయకుడన్నారు.ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిందని ఎన్టీఆరే అని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటు చేయించామని వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరును కొనసాగించినట్లు చెప్పారు.  గోదావరి పుష్కరాల ఘాట్‌ వద్ద శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలు పెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Chandrababu  Bharataratna  Mahanadu  Motion  

Other Articles