BJP, amithsha, Ram mandir, Ayodya, 370 article

Bjp party president amithsha respond on ayodya temple

BJP, amithsha, Ram mandir, Ayodya, 370 article

BJP party president amithsha respond on ayodya temple. He said that bjp will dont away from ram mandir and 370 article.

రామమందిరంపై అమిత్ షా మాట

Posted: 05/28/2015 08:32 AM IST
Bjp party president amithsha respond on ayodya temple

రామ మందిర అంశాన్ని ఎంతమాత్రం పక్కకు పెట్టలేదని, దానిపై తమ పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లేదన్న సాకు చూపి రామ మందిర నిర్మాణం, 370 అధికరణం వంటి తమ సిద్ధాంత అంశాలను బిజెపి పక్కకు నెడుతోందన్న విమర్శలను అమిత్‌షా తిరస్కరించారు. రామ మందిర అంశం సుప్రీంకోర్టు ముందు ఉంది, సుప్రీం తీర్పును తమ పార్టీ అనుసరిస్తుందని, ఎవరైనా తీర్పును గౌరవించాల్సిందేనని అమిత్‌షా అన్నారు. రామ మందిర అంశం, 370 అధికరణం విషయంలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమన్న మంగళవారంనాటి తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అసలు రామమందిర అంశంపై అప్పుడు నన్నెవరూ ప్రశ్నించలేదని షా అన్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చట్టం చేసేందుకు రాజ్యసభలో తమ పార్టీకి తగినంత బలంలేదంటూ మే 10న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై హిందూ సాధువులు మండిపడ్డ సంగతి తెలిసిందే.. మీ హయాంలో అవినీతికి మీదే బాధ్యత్ణ మన్మోహన్‌సింగ్‌పై అమిత్‌షా విమర్శ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి తానొక్కరూ సరీగ్గా ఉంటే చాలదని, తన హయాంలో వ్యవస్థలో జరిగిన అవినీతికి కూడా బాధ్యత వహించాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ అమిత్‌షా అన్నారు. మన్మోహన్‌ నేతృత్వంలో జరిగిన కుంభకోణాల విలువ రూ. 12 లక్షల కోట్లు, కాంగ్రెస్‌ ఆ బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటుందని అమిత్‌ షా ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అవినీతి గురించి పదేపదే ప్రస్తావిస్తుందంటూ మన్మోహన్‌సింగ్‌ చేసిన విమర్శలపై అమిత్‌షా బదులిచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  amithsha  Ram mandir  Ayodya  370 article  

Other Articles