Sunstroke, Mahanadu, Hyderabad, Temperature

Sunstroke hit the tdp mahanadu

Sunstroke, Mahanadu, Hyderabad, Temperature

Sunstroke hit the tdp mahanadu. In Mahanadu near to 40 members hit by sunstroke. TDP karyakarthas got more problems by temperature.

మహానాడులో వడదెబ్బ

Posted: 05/28/2015 08:30 AM IST
Sunstroke hit the tdp mahanadu

తెలుగుదేశ: పార్టీ తన 34వ మహానాడును అట్టహాసంగా ప్రారంభించింది. అయితే మండుతున్న ఎండలు మహానాడు మొదటి రోజే ఎఫెక్ట్ చూపించాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎండల ప్రభావంతో దాదాపు 700 మంది మృతి చెందారు. తాజాగా మహానాడులో టిడిపి కార్యకర్తలకు హాజరైన వారిలో మొత్తం 46 మందికి వడదెబ్బ తగిలింది. మండుతున్న ఎండలు.. వడగాడ్పుల నేపథ్యంలో తక్కువ మంది ప్రతినిధులు వస్తారని నిర్వాహకులు భావించినప్పటికీ వేలాదిగా ప్రతినిధులు తరలిరావడంతో మెయిన్ గేట్ కిక్కిరిసిపోయింది. కార్డులు మర్చిపోయి వచ్చిన వారిని లోపలికి అనుమతించకపోవడంతో సుమారు నాలుగైదు వేల మంది బయటే ఎండలో ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చిన ప్రతినిధుల సంఖ్యకు అనుగుణంగా సమావేశ మందిరంలో కుర్చీలు వేయకపోవడం మరో సమస్యకు మధ్యాహ్న భోజన విరామం కోసం బయటకు వెళ్లిన ప్రతినిధులకు మళ్లీ లోపల స్థలం దొరకలేదు. సభా ప్రాంగణంలో ఉన్నవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం అందినా అక్కడ స్థలం లేక దూరంగా ఉండిపోయిన వారికి మాత్రం అవి దొరకలేదు. ఎండ వేడిమికి వారు బాగా ఇబ్బంది పడ్డారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunstroke  Mahanadu  Hyderabad  Temperature  

Other Articles