chandrababu | budget | kcr | ktr | telangana | hyderabad

Telangana it minister ktr commented on nara chndrababu naidu about the surplus budget in telangana

chandrababu, budget, kcr, ktr, telangana, hyderabad

Telangana IT Minister KTR commented on Nara chndrababu naidu about the surplus budget in telangana. He said that Before birth of chandrababu telaangana has the surplus budget.

చంద్రబాబు పుట్టక ముందే మా దగ్గర ఉంది: కేటీఆర్

Posted: 05/27/2015 08:34 AM IST
Telangana it minister ktr commented on nara chndrababu naidu about the surplus budget in telangana

తెలంగాణ నేతలు ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ అన్నా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నా ఎంతలా లేచిపడతారో అందరికి తెలుసు. చంద్రబాబు మాటెత్తితే చాలు ఒళ్లంతా జెర్రలు పారినట్లు తెగ చిరాకుపడతారు. తాజాగా మరోసారి చంద్రబాబు మీద విమర్శలు చేశారు తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్.  నారా చంద్రబాబు నాయుడు పుట్టక ముందే రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉందని కేటీఆర్ అన్నారు. అయినా తెలంగాణ, హైదరాబాద్ లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకొంటున్నారని.. వాస్తవానికి ఆయన పుట్టక ముందే తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ ఉండేదని వెల్లడించారు. ఆంధ్రతో విలీనం నాటికి కూడా మిగులు రాష్ట్రంగానే ఉందని, విలీనం తర్వాత కూడా తెలంగాణ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉందని చెప్పారు


తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చంద్రబాబు నిందలు వేస్తున్నారని చెప్పారు. తనవల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి తెలిపారు.తెలంగాణ శ్రేయస్సు కోసం కేసీఆర్ తపిస్తున్నారని వెల్లడించారు. మొత్తానికి తమ నాయకుడు, తండ్రి అయిన కేసీఆర్ ను పొగుడుతూ, చంద్రబాబును తూర్పారబట్టారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో నేటి నుండి మహానాడు ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశానికి దిక్కులేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలన భేష్ అంటూ తెగ మెచ్చుకున్నారు కేటీఆర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  budget  kcr  ktr  telangana  hyderabad  

Other Articles