google, hyderabad, campus, telangana,

Google starting hyderabad campus with 1500 crores

google, hyderabad, campus, telangana, IT, KTR, Jayesh ranjhan

Google starting hyderabad campus with 1500 crores. Google, owner of the world's largest search engine, is investing Rs 1,500 crore in a new campus in Hyderabad, reckoned to be its biggest outside the US.

గూగుల్ హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటుకు 1500 కోట్లు

Posted: 05/26/2015 07:18 PM IST
Google starting hyderabad campus with 1500 crores

ప్రపంచంలో అతిపెద్ద సెర్చింజన్ గూగుల్ ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటుకు అంతా సిద్దమైంది. దాదాపు 1500 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ను ఏర్సాటు చెయ్యడానికి గూగుల్ సంస్థ సిద్దంగా ఉన్నట్లు తెలంగాణ ఐటి సెక్రటరీ జయేష్ రాంజన్ వెల్లడించారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ తో పాటు కాలిఫోర్నియాలో పర్యటించిన జయేష్ గూగుల్ క్యాంపస్ వివరాలను వెల్లడించారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో దాదాపు 1300 మంది ఉద్యోగులకు సరిపోయేలా గూగుల్ తన క్యాంపస్ ను ఏర్పాటు చెయ్యనుందని వివరించారు. ఐటి విస్తరణలో భాగంగా గతంలో గూగుల్ సంస్థ అడిగిన భూమి కన్నా ఎక్కువ భూమి అందించడానికి తెలంగాణ సర్కార్ సిద్దంగా ఉంది. ఈ మేరకు తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ గూగుల్ ప్రతినిధులతో చర్చించి ఓ ఒప్పందానికి వచ్చారు. అయితే తాజగా హైదరాబాద్ లో నిర్మించాలని అనుకుంటున్న గూగుల్ క్యాంపస్ ఆసియాలోనే అతిపెద్దదిగానూ, ప్రపంచంలోనే రెండో పెద్ద క్యాంపస్ గా రూపదిద్దనున్నారు.

గూగుల్ సంస్థ ప్రస్తుతం మూడు అంశాలపై దృష్టిపెట్టిందని తెలంగాణ ఐటి సెక్రటరీ జయేష్ రాంజన్ తెలిపారు. గూగుల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్, స్ట్రీట్ వ్యూ, గూగుల్ ఎడ్యుకేషన్ పై కాంసట్రేషన్ ఉంచిందని.. అందులో భాగంగా వీలైతే గూగుల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను వీలైతే తెలంగాణలో ప్రారంభించేలా చూడాలని గూగుల్ ప్రతినిధులను కొరినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఐటి శాఖ చేస్తున్న కృషి కారణంగానే గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ హైదరాబాద్ నగరంలో అతిపెద్ద క్యాంపస్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  hyderabad  campus  telangana  IT  KTR  Jayesh ranjhan  

Other Articles