ap | telangana | ganda

Ap and telangana ministers meet to discuss about the cet

ap, telangana, ganda, kadium, eamcet

Ap and telangana ministers meet to discuss about the CET. Srihari and ganta discuss with governor on ap eamcet and some more issues.

ఆ మంత్రులు సెట్ చేసుకుంటారా..?!

Posted: 05/26/2015 06:39 PM IST
Ap and telangana ministers meet to discuss about the cet

తెలంగాణ, ఏపి విద్యార్థుల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటే సెట్ పై రెండు రాష్ట్రాల మంత్రులు చర్చలు సాగిస్తున్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎవరికి వారు ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షల గురించి తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఏపి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ లు గవర్నర్ తో సమావేశమయ్యారు. ఏపి ఎంసెట్ కు సహకారం, ఉన్నత విద్యా మండలి అంశం, విద్యా శాఖకు సంబందించిన పాత రికార్డులు, సిబ్బంది కేటాయింపుపై రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. గతంలో ఎంసెట్ నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. ఏపి ప్రభుత్వం హైదరాబాద్ లో ఎంసెట్ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు ఎలాంటి సంబందం లేదని వెల్లడించింది. రెండు రాష్ట్రాల విద్యార్థుల కోసం వేరువేరుగా ఎంసెట్ నిర్వహించుకోవడంతో సమస్య సద్దుమణిగింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  telangana  ganda  kadium  eamcet  

Other Articles