special status | ap | chandrababu naidu

Ap cm chandrababu naidu spoke on special status for state

special status, ap, chandrababu naidu

Ap cm chandrababu naidu spoke on special status for state. THe chandrababu said that ap need special status.

హమ్మయ్య.. బాబు ఆ విషయం మీద మాట్లాడారు

Posted: 05/26/2015 08:48 AM IST
Ap cm chandrababu naidu spoke on special status for state

చాలా కాలంగా అన్ని పార్టీలు, దాదాపు అందరూ ఓ విషయాన్ని మాట్లాడుతున్నా.. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం దాని మీద పెదవి విప్పలేదు. కానీ తాజాగా మాత్రం మాట్లాడారు. ఇంతకీ ఏంటీ మ్యాటర్ అనుకుంటున్నారా..? ఏపికి ప్రత్యేక హోదా గురించి. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందేవరకు కేంద్రం సహాయం చేయాలనీ అలా చేస్తారని ఆశిస్తున్నాననీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని నేనూ కోరుతున్నా. ఏపీ రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసు..కనుక రాజధాని నిర్మాణంతో సహా అన్ని విషయాల్లోనూ కేంద్రం సహాయం అవసరమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ లో నేడు ఆయవ సింగపూర్ ప్రతినిధి బృందంతో అమరావతి నిర్మాణం పై చర్చించారు.  హైదరాబాద్ లో పదేళ్లు కొనసాగవచ్చునన్న వెసులు బాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో రాజధాని నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయదలచామని చెప్పారు. గడువు చెప్పలేను గాని వీలైనంత తొందరగా రాజధానిని నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. నిజానికి ఇది ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత మంచిదన్నారు. రాజధాని నిర్మాణం వేలాది కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది కనుక కేంద్రం సహాయం చేయాల్సిందేనన్నారు. గత కొంత కాలంగా ప్రత్యేక హోదా మీద నేతలు తలా ఓ మాట మాట్లాడతుండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తానికి చాలా కాలం తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఏపికి ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ గళం విప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : special status  ap  chandrababu naidu  

Other Articles