amarvati | amravati | singapur | master plan

Singapur officials discribed amaravati as amravati

amarvati, amravati, singapur, master plan, chandrababu, ap, capital

Singapur officials discribed amaravati as amravati. CHandrababu naidu has centement in the name of amaravati.

అమరావతి కాదు అమ్రావతి

Posted: 05/26/2015 07:35 AM IST
Singapur officials discribed amaravati as amravati

ఏపి నూతన రాజధాని అమరావతి పేరును సింగపూర్‌ ప్రభుత్వం 'అమ్రావతి'గా మార్చి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన అమరావతి బౌద్ధారామంగా ప్రసిద్ది చెందింది. ఆ తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కూడా అమరావతినే రాజధానిగా ఎంచుకొని 18వ శతాబ్దంలో పరిపాలన సాగించారు. ఆయన హయాంలోనే అమరావతిలో అమరలింగేశ్వర ఆలయాన్ని నిర్మించి అమరావతి పేరును శాశ్వతం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన అమరావతినే ఆంధ్రుల రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంచుకొని ప్రశంసలు పొందారు. అమరావతి పేరులో ఆంగ్లంలో పరిశీలిస్తే(amaravati) తొమ్మిది అక్షరాలు ఉంటాయి. చంద్రబాబుకు కూడా తొమ్మిది సంఖ్యపై నమ్మకం ఉన్నట్లు ఆయన ఎంచుకునే అంకెలు, సంఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. అయితే సింగపూర్‌ ప్రభుత్వం ఎనిమిది అంకెలతోనే అమరావతి పేరును మాస్టర్‌ ప్లాన్‌లో ప్రచురించింది.

రాజధాని ప్రాంతాన్ని వాస్తు రీత్యా ఎంచుకొని ఆదిశలోనే భూ సమీకరణ కూడా చేపట్టారు. రాజధానికి ఉత్తరంగా కృష్ణానదిని సరిహద్దుగా నిర్ణయించారు. రాజధాని నుంచి ఈశాన్య మూలకు నదీ ప్రవాహం ఉండేలా మరీ ఎంచుకొని భూములను సమీకరించారు. ఆ భూముల్లోనే సింగపూర్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. తెలుగు ప్రజలు సంఖ్యా శాస్త్రాన్ని బలంగా విశ్వసిస్తూ నామకరణాలు, మోటారు వాహనాలకు నెంబర్లు తీసుకుంటారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే దానిపై మాట్లాడేందుకు విముఖత చూపారు. సింగపూర్‌ అధికారుల ఉచ్చారణలో కూడా అమ్రావతిగానే మారింది. అయితే ఈ విషయాన్ని తాము పరిశీలించలేదనీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఓ అధికారి చెప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amarvati  amravati  singapur  master plan  chandrababu  ap  capital  

Other Articles