ap capital city amaravati master plan details are finally revealed

Ap capital city amaravati master plan details

ap capital city, amaravati city details, ap capital city amaravati details, surbana organization updates, singapore master plan, ap capital city master plan

ap capital city amaravati master plan details : singapore surabana organization ceo has revealed the details of ap capital city amaravati master plan.

మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఏపీ రాజధాని ఇలా వుంటుందట!

Posted: 05/25/2015 06:30 PM IST
Ap capital city amaravati master plan details

ఏపీ రాజధాని విషయమై సింగపూర్ ప్రభుత్వం గతకొన్నాళ్ల నుంచి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే! చివరికీ ఆ బృహత్తర ప్రణాళికను మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. హైదరాబాద్ లో ఈమేరకు జరిగిన సమావేశంలో సింగపూర్ కు చెందిన సుర్బానా సంస్థ సీఈవో.. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణం ఏ విధంగా వుంటుందో స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు క్రింది విధంగా వున్నాయి.

* సీఆర్డీఏ పరిధిని ఏడు కారిడార్లుగా విభజించారు.
* 270 కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని నిర్మాణం జరుగుతుంది.
* విజయవాడ నుంచి బెంగుళూరు, చెన్నై, విశాఖపట్నం దిశగా ప్రధాన రహదారుల నిర్మాణం
* ఎక్స్ ప్రెస్ వే 60 కిలోమీటర్లు విస్తరించి నిర్మించడం
* రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం
* నాలుగు లేన్ల రోడ్లు నగరం మొత్తం విస్తరించేలా నిర్మాణం చేపట్టడం
* కృష్ణాతీరం రాజధానికి మరింత అనుకూలంగా మారనుంది.
* కోటీ పదిలక్షల మందికి తగ్గట్టు రాజధాని నిర్మాణం జరగనుంది.

ఇలా ఈ విధంగా రాజధాని నిర్మాణం వుంటుందని సుర్బానా సంస్థ సీఈవో వెల్లడించారు. ముఖ్యంగా ఈ ప్లాన్ వాస్తు ప్రకారం వుండటం విశేషం. త్వరలోనే ఈ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణం జరగనుందని ఆయనతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital city  amaravati master plan  chandrababu naidu  

Other Articles