ap, special status, Arun jaitly, Fund, modi, chandrababu

Central finance minister arun jaitly said that central govt will give more fund to andhrapradesh

ap, special status, Arun jaitly, Fund, modi, chandrababu

Central finance minister Arun Jaitly said that central govt will give more fund to andhrapradesh. Arun jaitly indirectly clear that central govt may not ready to give special status to ap.

ఏపి ప్రత్యేక హోదా లేదు.. నిధులు మాత్రమేనా.?

Posted: 05/23/2015 08:05 PM IST
Central finance minister arun jaitly said that central govt will give more fund to andhrapradesh

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏపి అభివృద్దికి కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యుపిఎ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే మాత్రం ప్రత్యుేక హోదాపై మీన మేషాలు లెక్కిస్తోంది. ప్రత్యేక హోదా కల్పిస్తే ఇచ్చే నిధుల కన్నా ఎక్కువ నిధులు ఇస్తామని అంటూనే ప్రత్యేక హోదాపై కేంద్రం మనోగతాన్ని వెల్లడించారు. ఆడలేక మద్దెల బాగులేవన్న చందాన కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం ఇష్టంలేకనే ఇలా మాట మారుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదాపై ఎలాంటి మాటా మాట్లాటడం లేదు. ఇక వెంకయ్య నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేక హోదా రావాలంటే సవాలక్ష ఫార్మాల్టీస్ ఉంటాయని.. మొత్తానికి కష్టమని అన్నారు.

ఇప్పటికే చాలా రాష్ట్రాలకు కల్పిస్తున్న ప్రత్యేక హోదా కల్పనకు గత యుపిఎ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీయే ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రత్యేక హోదా కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. అయితే దాదాపుగా ఏడాది గడుస్తున్నా.. ఎన్డీయే ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కనీసం రాజధాని కూడా లేని ఏపికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. కానీ కేంద్రం మాత్రం నిధులతోనే కాలం వెల్లదీసేలా కనిపిస్తోంది. అయితే ప్రత్యేక హోదా కల్పిస్తే మిగితా రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు కేంద్రంపై తీవ్ర వత్తిడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఏపికి ఎలాగూ లోటు బడ్జెట్ ఉంది కనుక ఆశించిన దాని కన్నా ఎక్కువ నిధులను కేటాయిస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వాస్తవానికి నిధులు ఏపి అభివృద్దికి సరైన పరిష్కారం కాదు అన్నది అందరి వాదన. మరి ఏపి రాజధాని శంఖుస్థాపనకు చంద్రబాబు ఎలాగూ ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయించారు. కనుక ఆ రోజు ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందేమో అని ఎదురుచూడాలి. మొత్తానికి ఎన్డీయే ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదాపై ఒక్కసారి ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన మాత్రం మరోలా ఉంది. తాజాగా అరుణ్ జైట్లీ మాటలకు మరి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  special status  Arun jaitly  Fund  modi  chandrababu  

Other Articles