Viral Gay Matrimonial Ad for 'Groom' Gets over 70 Proposals in Just 2 Days

Gay matrimonial ad placed by activist s mother attracts 73 proposals

Harrish Iyer, Padma Iyer, gay matrimonial ad, matrimonial ad for Gay son, proposals come in from across the world, US, UK and Saudi Arabia, Gay in India, Gay Matrimonial ad, Homosexuality in India, Sec 377, LGBT community, gay activists, Harish iyer gay ad, Harish iyer proposals, gay lesbians, Gay marriages, Indian gays lesbians,gay news

Harrish Iyer, whose mother Padma placed the ad on his behalf, says he is overwhelmed by the response; proposals come in from across the world, including the US, UK and Saudi Arabia

మగ వధువును చేసుకునేందుకు రెండు రోజుల్లో 73 వరులు

Posted: 05/23/2015 04:00 PM IST
Gay matrimonial ad placed by activist s mother attracts 73 proposals

గే వరుడు కావలెను’ అంటూ ప్రచురితమై.. సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి 73 ప్రపోజల్స్‌ వచ్చాయని గే హరీష్‌ తల్లి, పద్మ అయ్యర్‌ తెలిపారు. ప్రకటనలో తెలిపినట్లుగా ఎక్కువమంది అయ్యర్లే ప్రతిస్పందించారని ఆమె చెప్పారు. ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని హరీష్‌ తెలిపారు. ఆసే్ట్రలియా, యూకే, యూఎ్‌సతో పాటు సౌదీ అరేబియానుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అయ్యర్లతోపాటు గుజరాతీలు, ముస్లింలు చాలా మంది మెయిల్‌ చేశారని హరీష్‌ తెలిపారు.

ఓ తల్లి నిజాయితీగా తన కుమారుడిని పెళ్లి చేసుకునేందుకు వరుడు కావాలని ప్రకటన ఇవ్వడం సంచలనం కాగా, అందుకు దేశ విదేశాల నుంచి వచ్చిన వరులు సిద్దంగా వున్నామని స్పందించడం కూడా సంచలనం సృష్టించింది. తాను ఈ లోకం విడిచే వెళ్లే కంటే ముందే తన కుమారుడు ఓ ఇంటి వాడు కావాలని, అందుకే ప్రకటన ఇచ్చానని ఓ 58 ఏళ్ల తల్లి తానిచ్చిన ప్రకటనలో తెలిపింది. ముంబైలో నివసిస్తున్న హరీష్(36) అనే గేకు వరుడు కావాలని అతని తల్లి పేపర్లో ప్రకటన ఇచ్చింది. వరుడు 25-40 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. జంతువులను ప్రేమించాలి. శాఖాహారి అయి ఉండాలి. ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు ఉండాలి. ఎన్జీవోలో పని చేస్తూ ఉండాలని పేర్కొంది. కులంతో సంబంధం లేదు. ముంబయిలో హరీష్ అందరికీ ఎల్‌జీబీటీగా పరిచయం. ఎల్‌జీబీటీ అంటే - లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్). ఎల్‌జీబీటీ కార్యకర్తగా, ఎన్జీవోగా పని చేస్తున్నాడు హరీష్. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్‌ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harrish Iyer  Padma Iyer  Gay Matrimonial ad  Homosexuality in India  Sec 377  

Other Articles