Nirbhaya, KCR, Telangana, revanth Reddy

Nirbhaya case on telangana cm kcr

Nirbhaya, KCR, Telangana, revanth Reddy

Nirbhaya case on Telangana cm kcr. TDp leader Revanth reddy demand to file Political Nirbhaya case on KCR.

కేసీఆర్ మీద నిర్భయ కేసు...? నిజమేనా..?

Posted: 05/23/2015 03:29 PM IST
Nirbhaya case on telangana cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిర్భయ కేసు అని చదవగానే నిజమా అన్న డౌట్ వస్తుంది కదా..? కానీ నిజం బక్కపలుచని మనిషి కేసీఆర్ మీద నిర్భయ చట్టం పెట్టాలని ఓ పొలిటికల్ లీడర్ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్భయ చట్టం అంటే రాజకీయ నిర్భయ చట్టం పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. అవును గత వారం రోజుల నుండి వార్తల్లోకి రాని ఆ రేవంత్ రెడ్డిగారే తాజా ఆరోపణల పుణ్యమా అని వార్తల్లోకెక్కారు. ఇంతకీ ఎందుకు అతను కేసీఆర్ మీద నిర్భయ చట్టం గురించి మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా..? తెలంగాణను అడ్డుకున్న వారికే ఎమ్మెల్సీ పదవులిచ్చారని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి.

కోదండరామ్, దూవీప్రసాద్, జయశంకర్, అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎందుకు పదవులు ఇవ్వడం లేదని తెలుగుదేశం ఎల్పీనేత రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు అని నీతులు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా ఓటు వేసి సిఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నట్లు అసలు నిర్భయ చట్టం ఎందుకు పెట్టాలో ఎవరికీ అర్థం కాలేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  KCR  Telangana  revanth Reddy  

Other Articles