LG, OLED, tv, koreya

Lg company intraoduce the slim ever oled like a wallpaper

LG, OLED, tv, koreya

LG company intraoduce the slim ever OLED like a wallpaper. LG introduce 1.9kg weight and 0.97mm thick OLED tv.

ఈ టీవీ పేపర్ లాంటిది గురూ..!

Posted: 05/23/2015 03:20 PM IST
Lg company intraoduce the slim ever oled like a wallpaper

ఒకప్పుడు టీవీ సెట్ అంటే ఇంట్లో చాలా ప్లేస్ కావాల్సి ఉండేది. కానీ తర్వాత తర్వాత టివి సైజ్ తగ్గింది. చిన్న టేబుల్ ఉన్నా సరిపోయేంత టివిలు వచ్చేశాయి. ఇక ఆ తర్వాత ఎల్.సి.డిలు వచ్చాయి. ఎల్సిడిలు వచ్చిన తర్వాత టివి రంగంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎల్సీడీల గురించే గొప్పగా అనుకుంటున్నప్పుడు ఎల్ఈడీలు వచ్చాయి. ఏ యాంగిల్ నుండి చూసినా పిక్చర్ చాలా క్లీయర్ గా కనిపించేలా ఎల్ఈడీ తయారు చేశారు. అయితే తాజాగా వచ్చిన రెవల్యూషన్ నిజంగా సూపర్ ఎందుకు అంటారు మనం ఇంట్లో వాల్ పేపర్లు అంటించినంత స్లిమ్ గా ఓఎల్ఈడీలు వచ్చాయి. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం..

డిస్‌ప్లే టెక్నాలజీని మరో కొత్త అధ్యయనానికి తీసుకువెళుతూ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కంపెనీ ఎల్‌జీ  గోడకు అంటించుకునే విధంగా సూపర్ స్లిమ్ మోడల్ ఓఎల్ఈడి ప్యానల్‌ను విడుదల చేసింది. ఈ 55 అంగుళాల వేరుచేయగల (డిటాచబుల్) ఓఎల్ఈడి ప్యానల్ కేవలం 0.97 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన కాబడింది. బరువు 1.9 కిలో గ్రాములు. మ్యాగ్నటిక్ మ్యాట్ సహాయంతో ఈ ప్యానల్‌ను చాలా సలువుగా గోడకు ఏర్పాటు చేయవచ్చు. ఈ ఓఎల్ఈడి ప్యానల్స్ అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతానికి 55, 66, 77 అంగుళాల స్ర్కీన్ వేరింయట్ లలో అందుబాటులో ఉన్న ఈ ఓఎల్ఈడి ప్యానల్స్‌ను త్వరలో 99 అంగుళాల వేరియంట్‌లో ఆవిష్కరించనున్నట్లు ఎల్‌జీ డిస్‌ప్లే ఓఎల్ఈడి డివిజన్ తెలిపింది. తమ ప్లాస్టిక్ ఓఎల్ఈడి టెక్నాలజీతో పాటు ట్రాన్స్‌పెరంట్ డిస్‌ప్లే ఇంకా ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీలను మరింత అభివృద్థి చేయనున్నట్లు ఎల్‌జీ డిస్‌ప్లే విభాగం పేర్కొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LG  OLED  tv  koreya  

Other Articles