eiffel tower | Paris | Close |Pick pocketers

World famus eiffel tower closed on pick pocketers at towers

eiffel tower, Paris, Close,Pick pocketers

World famus eiffel tower closed on pick pocketers at towers. The employees who were work at efil towers went on strike. From last days pick pocketers distrubling an getting troubles to visitors.

హవ్వ.. ఈఫిల్ టవర్ ను అందుకు మూసేశారా..?!

Posted: 05/23/2015 11:01 AM IST
World famus eiffel tower closed on pick pocketers at towers

బాంబు పేలుళ్లు, తీవ్రవాద ముప్పు, దాడులు లాంటి అత్యవసర పరిస్థితుల్లో తప్ప పర్యాటకుల తాకిడితో అలరారే ఈఫిల్‌ టవర్‌ ను మూసివేశారు. సందర్శకులపై జేబు దొంగలు దాడి చేస్తూ దోచుకోవడం వలన విసిగి పోయిన టవర్‌ ఉద్యోగ సిబ్భంది సందర్శనను  నిలిపివేశారు. అవును మీరు విన్నది నిజమే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఈఫిల్ టవర్ ను మూసివెయ్యాల్సి వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమసైన ఈఫిల్ టవర్ ను ఇలా జేబు దొంగల బెదడతో మూసివెయ్యడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జేబు దొంగల ఆగడాలను పూర్తిగా అరికట్టాల్సిందిగా టవర్‌ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటా సుమారుగా ఏడు మిలియన్ల పర్యాటకులతో ఈ స్మారక స్థూపం అలరారుతుంది. నలుగురైదుగురు ఒకగుంపుగా ఏర్పడి పర్యాటకులపై దాడులకు దిగి దోచుకుంటున్నారు. ప్యారిస్‌ సిటి లెక్కల ప్రకారం 2014లో దాదాపు 22 మిలియన్ల పర్యాటకులు సందర్శించారు. ప్రపంచ తొలి పర్యాటక ప్రాంతాల్లో ఈఫిల్‌ టవర్‌ ప్రతి ఏడాది తొలి స్థానాల్లో నిలుస్తుంది. అయితే ఈఫిల్ టవర్ ను మళ్లీ ఎప్పుడు తెరుస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత ఓ కొలిక్కి వస్తే అప్పుడు క్లారిటీ ఇస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eiffel tower  Paris  Close  Pick pocketers  

Other Articles