IMD | Red alert | Temperature

Imd announce red alert due to high temperatures in india

IMD, Red alert, Temperature

IMD announce red alert due to high temperatures in india. From last one week temepatures hit record level in india.

దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటన

Posted: 05/23/2015 10:29 AM IST
Imd announce red alert due to high temperatures in india

దేశంలో రెడ్ అలర్డ్ హారన్ మోగింది.  దేశం మీద ఏ ఉగ్రవాద సంస్థో లేదో పొరుగు దేశాలో యుద్దానికి సిద్దపడుతున్నాయని కంగారు పడతారేమో అస్సలు కాదు. గత వారం రోజులుగా ఎండలు ఎలా మండుతున్నాయో.. ఎండలు మండి జనాలను చంపేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 250 మందికిపైగా ప్రాణాలను కోల్పోయారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెరిగిన టెంపరేచర్ తో ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత వాతావరణ శాఖ ఈ రోజు దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు  భానుడి భగభగలతో మండిపోతున్నాయి. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427మంది మృత్యువాత పడ్డారు. కాగా రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

మండే ఎండలు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నాయి. వడగాల్పులు, ఎండ వేడిమికి తట్టుకోలేక శుక్రవారం జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉదయం తొమ్మిది గంటల కాక ముందు నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వృద్ధులు, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికం కావటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక హైదరాబాద్లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 67మంది, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో 64మంది వడదెబ్బకు మృతి చెందారు. ఏపీలో 204 , తెలంగాణలో 223 వడదెబ్బ మరణాలు నమోదు అయ్యాయి. ఇక వడదెబ్బకు మృతి చెందినవారు కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  Red alert  Temperature  

Other Articles