TDP | Narachandrababu naidu | AP | June2

Telugudesam party president nara chandrababu order to dismiss celebrations and strike in june 2

TDP, Narachandrababu naidu, AP, Telangana, Formation day, June2

Telugudesam party president nara chandrababu order to dismiss celebrations and strike in june 2. But all parties in telangana getting ready to celebrate grandly telangana state formation on june 2nd.

సంబరాలు వద్దు దీక్ష చాలు.. టిడిపిలో జూన్ 2పై గందరగోళం

Posted: 05/23/2015 10:08 AM IST
Telugudesam party president nara chandrababu order to dismiss celebrations and strike in june 2

తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి ఏడాది పూర్తికావస్తుండటంతో అన్ని పార్టీలు సంబరాలకు సిద్దమవుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం సంబరాలు కాకుండా దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు క్యాడర్ కు సూచించారు. అన్ని పార్టీలు సంబరాలకు సిద్దమవుతున్నా.. తమ పార్టీ మాత్రం తెలంగాణ నిర్మాణంపై దీక్ష చేస్తుందని పార్టీ నాయకులు వెల్లడించారు. అయితే సర్వత్రా సంబరాలకు సిద్దమవుతుంటే ఒక్క తెలుగుదేశం మాత్రం దూరంగా ఉండటంపై అప్పుడే విమర్శలకు తావిస్తోంది. అయితే తాము చేస్తున్న నిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకంగా కాదని... నవ్యాంధ్ర ప్రజల మనసుల్లో ఆత్మస్థైర్యం నింపడానికే అంటున్నారు ఏపి నేతలు. అయితే తెలంగాణ నేతల మాట మరోలా ఉంది. తెలంగాణలో సంబరాలకు దూరంగా ఉంటే పార్టీకి నష్టం కలుగుతుంది అని వారంటున్నారు.

అయితే ఏపిలో ఇప్పటికే అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మాత్రం సంబరాలు జరుపుకుంటే ఏపిలో తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ఏపి నాయకులు సూచించినట్లు సమాచారం. నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రజలు పునరంకితం అయ్యేందుకు, మరింతగా స్ఫూర్తినిచ్చేందుకు ఇది చైతన్య దీక్షగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ఉద్యోగులు ఏపీకి వెళ్లి దీక్షలోపాల్గొనాలని చంద్రబాబు అన్నారు. విభజించిన వారే అసూయపడేలా దీక్షను చేపట్టాలి. దీన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా 13 జిల్లాల ప్రజల సొంత కార్యక్రమంలా చేపట్టాలని వివరించారు. రాజధాని ఇవ్వకుండా కట్టుబట్టలతోనే బయటకు పంపించేశారని, చివరకు రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్‌ కమిటీని నియమించి ఏపీలోని మూడు ప్రాంతాల్లో చిచ్చుపెట్టాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన దారుణానికి ప్రజలు కసిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేశారు. అందుకే వారికి మరోసారి విభజన కష్టాలను గుర్తు చేయండి. ఆనాటి వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. ఆ బాధలను గుర్తుచేసుకొని మరింత కసిగా నవ నిర్మాణానికి ప్రజలు ముందుకు కదలాలి’’ అని పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్షలో ప్రభుత్వ విజయాలు, హామీల అమలు గురించి చెప్పాలని, హామీ ఇచ్చినట్లు ఐదు సంతకాలను నెరవేర్చామని గుర్తు చేయాలని సూచించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Narachandrababu naidu  AP  Telangana  Formation day  June2  

Other Articles