Telangana | KCR | Posters | Hordings

Telangana cm kcr order to remove hordings and posters on walls

Telangana, Cm, KCR, Posters, Hordings

Telangana cm KCr order to remove hordings and posters on walls. IN hyderabad many posters and hording displaying.

కేసీఆర్ అంతే అనుకుంటే అలా చేసేస్తారు

Posted: 05/23/2015 08:20 AM IST
Telangana cm kcr order to remove hordings and posters on walls

మార్పు మననుండే మొదలు కావాలి అప్పుడు కానీ మార్పు నిజంగా సాధ్యం కాదు అన్న విషయం అందరికీ తెలుసు కానీ.. మనం మారాలి, వ్యవస్థను మార్చాలి అంటే మాత్రం చాలా కష్టం. అందునా రాజకీయ నాయకులకు ఇది చాలా కష్టం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇందుకు అతీతం. ఎందుకు అంటారా..? కేసీఆర్ గత కొన్ని రోజులుగా చేస్తున్న పనులే ఇందుకు కారణం. తాజాగా హైదరాబాద్ నగరంలో రాజకీయ నేతలకు సంబంధించి హోర్డింగ్స్ తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముందుగా తన హోర్డింగ్స్ ను తొలగించాలని ఆయన స్వచ్ఛ భారత్ సమీక్ష సందర్బంగా అధికారులకు చెప్పారు. రాజకీయ నేతల హోర్డింగ్స్ ఉండకూడదని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న సంగతి ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతల హోర్డింగ్స్ నూ తొలగించాలని చెబుతూ టీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా హోర్డింగ్ లు, పోస్టర్లు అతికించరాదని చెబుతానన్నారు.

నగరంలో ప్రతి ప్రాంతంలోనూ గోడలపైనా, మెట్రో పిల్లర్లపైనా తనవి, టీఆర్‌ఎస్‌ నేతలవి పోస్టర్ల పై కూడా  కేసీఆర్‌ ఫైరయ్యారు.  ఎక్కడ చూసినా గోడల మీద పోస్టర్లు కనిపిస్తుండటంతో దానిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  నగరంలో తనతోపాటు ఎవరి పోస్టర్లూ గోడలపై కనిపించరాదని, ప్రస్తుతం ఉన్న వాటిని తొలగించాలని ఆదేశించారు. ఇతర పార్టీలవారికీ ఈమేరకు విజ్ఞప్తి చేస్తానన్నారు. హరితహారం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న అధికారులు, పోలీసులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించడం వల్ల వాటి అందం చెడిపోతోందని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలపడంతో సీఎం ఇలా స్పందించినట్టు సమాచారం. మొత్తానికి స్వచ్ హైదరాబాదాలో భాగంగా పచ్చవాడికి నీతులు చెప్పడానికి ముందు తాను, తన ప్రభుత్వం నీతులు చెప్పడమే కాకుండా పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Cm  KCR  Posters  Hordings  

Other Articles