Rape accused granted bail on promise of marrying victim

Rape accused granted bail on promise marrying victim

Rape accused granted bail on promise of marrying victim, Bombay High Court, Justice A S Gadkari, Jaywant Jadhav, cheating and raping a girl, accused, common friend, forced victim into sexual relationship, interim relief from arrest

The Bombay High Court has granted anticipatory bail to a man accused of raping a girl with whom he was in a relationship after the accused assured the court that he would marry the victim.

పెళ్లికి ఒప్పుకున్నాడు.. ముందస్తు బెయిల్ తో వెళ్లాడు..

Posted: 05/22/2015 10:25 PM IST
Rape accused granted bail on promise marrying victim

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు తాను బాధితురాలిపై అత్యాచారం చేయలేదని, అలా అని బలవంతం కూడా చేయలేదని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న పిటీషన్ ను విచారించిన బోంబే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ గడ్కరీ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అదేలా సాధ్యం..? అత్యాచార నిందితుడికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చిందని మీ సందేహం కదా..? సాధరణంగా ఈ కేసులో బెయిల్ లభించాలంటే నిందితుడు కనీసం 45 రోజుల పాటు జైలులో వుండాలి. ఆ తరువాత కూడా న్యాయస్థానం విచారణ జరిపి బెయిల్ ఇస్తుంది. కానీ నిందితుడికి ముందస్తు బెయిల్ ఎలా వచ్చిందా..? అనుకుంటున్నారా.?

ఇక్కడ నిందితుడు తన తప్పును తెలుసుకుని, సరిదిద్దుకుంటానని న్యాయస్థానానికి తెలపడంతో.. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిన నిందితుడు జయవంత్ జాదవ్ కు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ గడ్కరీ బెయిల్ ఇచ్చారు. బాలికను మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్న జాదవ్ పై ఏప్రిల్ 4న ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన బాలికతో జాదవ్ పరిచయం పెంచుకున్నాడు. తర్వాత వారిద్దరూ హద్దులు దాటారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పెళ్లి చేయాలని జాదవ్ తల్లిదండ్రులను కోరగా వారు తిరస్కరించారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కేసు పెట్టారు. అయితే బాలికను పెళ్లాడేందుకు నిందితుడు ఒప్పుకోవడంతో కోర్టు ఈనెల 28 వరకు ముందస్తు బెయిలిచ్చింది. భవిష్యత్ లో ఆమెకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని జాదవ్,  అతడి కుటుంబ సభ్యులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  accused  Bombay High Court  anticipatory Bail  

Other Articles