Newborn | baby | walk | assam | high fever

Newborn baby forced to walk for cure high fever

Newborn, baby, walk, baby, assam, high fever

In an extremely disturbing incident, a two-day old baby boy was forced to walk by a village witch doctor in an attempt to cure high fever. The bizarre incident occurred in a remote village in Morigaon in the north-eastern state of Assam, where a crying newborn was grabbed by his neck by the alleged quack and forced to walk a few steps in order to cure high fever that the child was suffering since birth

ITEMVIDEOS: రెండు రోజుల చిన్నారి నడిచాడు.. కాదు నడిపించారు

Posted: 05/22/2015 01:08 PM IST
Newborn baby forced to walk for cure high fever

టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది. ఇలా అన్నింటా ముందుంటున్న మన ఇండియాలో ఇప్పటికే పాతకాలం మనుషుల్లాగా ప్రవర్తించే వారున్నారు. మూడ నమ్మకాలను పాటించే వారు ఇప్పటికీ వాటిని నమ్ముతున్నారు. తాజాగా అస్సాంలో జరిగిన ఘటన చూస్తే మీకే పాపం అనిపిస్తుంది. కేలవం రెండంటే రెండో రోజుల పసికందును నడిపించే ప్రయత్నం చేశారు. ఏంటీ రెండు రోజుల వయస్సు గల చిన్నారిని నడిపించారా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది వాస్తవంలో జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.


అస్సాంలో ఇదో దారుణం. రెండురోజుల చిన్నారిని ఓ మంత్రగత్తె సలహాపై బలవంతంగా నడిపించారు. గ్రామస్తులంతా చూస్తుండగానే ఆ బాలుడి తలిదండ్రులు ఇలా ఆ చిన్నారి మెడపట్టుకుని నడిపించారు. ఆ బాలుడికి తీవ్రమైన జ్వరం వస్తుండడంతో.. తలిదండ్రులు ఓ మంత్రగత్తెను ఆశ్రయించారు. జ్వరం తగ్గాలంటే ఇలా బలవంతంగా... బట్టలు లేకుండా నడిపించాలని ఆ మంత్రగత్తె చెప్పిందట. నిరక్షరాస్యులు, మూఢాచారాలను నమ్మే ఆ పేరెంట్స్ అలాగే చేశారు. మోరిగాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనను ఎవరో మొబైల్‌లో చిత్రీకరించి పోలీసులకు పంపారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరుకుని ఆ మంత్రగత్తెను అరెస్టు చేసి శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ చిన్నారి కోలుకుంటున్నాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Newborn  baby  walk  baby  assam  high fever  

Other Articles