Centralgovt | Kejriwal | Nazeb Jang

Central govt gave shock to the delhi cm avind kejriwal

Centralgovt, Kejriwal, LG, Nazeb Jang

Central govt gave shock to the delhi cm avind kejriwal. Homeministry clear that the Lg has the power to appoint anybody in delhi.

కేజ్రీవాల్ కు కేంద్రం షాక్.. ఇదే ఫైనల్ అంటూ గెజిట్

Posted: 05/22/2015 12:12 PM IST
Central govt gave shock to the delhi cm avind kejriwal

ఢిల్లీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిఎం కేజ్రీవాల్, లెఫ్టెనెంట్ గవర్నర్ ల మధ్య అస్సలు పొసగడం లేదు. పచ్చగడ్డి వేస్తే మండేలా ఉంది పరిస్థితి. రాష్ట్రపతి ముందుకు వీరి పంచాయితీ వెళ్లినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. అయితే తాజాగా కేజ్రీవాల్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ విషయంలో కేజ్రీవాల్, నజీబ్ జంగ్ లు పరిష్కరించుకొవాలని ముందు కేంద్రం సూచించింది. కానీ తర్వాత తర్వాత కేంద్రం కేజ్రీవాల్ కు షాకిచ్చింది. కేజ్రీవాల్ అంటున్నట్లు చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో ఎవరికి అధికారం ఉంది అన్న విషయాలను స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్రం.

ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నోట్ పంపింది. ఢిల్లీలో పరిపాలనపై తుది నిర్ణయం లెప్ట్నెంట్ గవర్నర్దేనని స్పష్టం చేసింది. నిర్ణయాలను తీసుకునే ముందు ఢిల్లీ కేబినెట్ను  సంప్రదించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.  కొన్నింటిపై ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నా..లెప్ట్నెంట్దే తుది నిర్ణయమని తెలిపింది. కాగా లెప్ట్నెంట్ గవర్నర్ను అడ్డంపెట్టుకుని బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి  చూస్తోందని విమర్శిస్తున్న ఆప్ దీనిపై ఎలా స్పందింస్తుందో చూడాలి. కేజ్రీవాల్, నజీబ్ జంగ్ ల మధ్య జరుగుతున్న వార్ ఏ రూపం దాల్చుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Centralgovt  Kejriwal  LG  Nazeb Jang  

Other Articles