Dasari | Bail | coalgate

Dasari narayan rao and some others got bail

Dasari, coalgate, jindal, madhu koda, patiyala, CBI

Dasari narayan rao and some others got bail. The patiyala court sanction bail to dasari, madhu koda, jindal and 12 others.

దాసరి అండ్ కోకు ఊరట.. బెయిల్ మంజూరు

Posted: 05/22/2015 11:12 AM IST
Dasari narayan rao and some others got bail

దాసరి, జిందాల్, మధు కోడాలకు బెయిల్ మంజూరు చేస్తూ పటియాలా సిబిఐ కోర్టు తీర్పును వెల్లడించింది. గత కొంత కాలంగా బొగ్గు నిక్షేపాల కేటాయింపుల విషయంలొ దాసరితో సమా మరో 18 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కోల్ గేట్ కేసులో వీరి ప్రమేయం కన్నా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖకు సంబందించి అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారని.. వీరికి ఎలాంటి సంబందం లేదంటూ దాసరి తరఫున లాయర్ వాదించారు. బెయిల్ కింద ఒక్కొక్కరు లక్ష పూచీకత్తు కింద సమర్పించాలని, తమ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలులేదని కోర్టు ఆదేవించింది.

కోల్ గేట్ స్కాంలో దాసరి అండ్ కో మాత్రం మాజీ ప్రధాని మన్మోహన్ పేరును వాడుకొని తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. లాయర్ వాదనలో అసలు వీరికి బొగ్గుశాఖకు ఎలాంటి సంబందం లేదని అన్నట్లుగా వాదించారు. బొగ్గు కేటాయింపుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ స్వయంగా దగ్గరుండి వ్యవహారాలన్నీ చూసుకున్నారని, ఆ శాఖ ప్రధాని చేతిలోనే ఉన్నందున తమ క్లయింట్లకు ఎలాంటి సంబందం లేదని వాదించారు. మొత్తానికి బొగ్గు స్కాంలో ప్రస్తుతానికైతే దాసరి అండ్ కోకు ఊరట లభించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari  coalgate  jindal  madhu koda  patiyala  CBI  

Other Articles