Brain dead | pregnent| delivery

Brain dead pregnent gave birth to baby in america

Brain dead, pregnent, delivery, Waterloo, Omaha, Nebraska,

Medics kept a brain dead pregnant woman alive on life support for seven weeks before delivering her baby successfully by emergency caeserean section. The child's mother Karla Perez, 22, complained of a severe headache before collapsing at her home in Waterloo, Omaha, Nebraska

ITEMVIDEOS: బ్రెయిన్ డెడ్ అయిన తల్లి బిడ్డకు జన్మనిచ్చింది

Posted: 05/07/2015 04:54 PM IST
Brain dead pregnent gave birth to baby in america

ప్రపంచం మారుతోంది.. ఒకప్పుడు ఏవేవో రోగాలతో చాలా మంది చావు మొహం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఎవరికి ఆరోగ్యానికి హాని కలిగిన వెంటనే దేశవిదేశాల నుండి డాక్టర్లు అందులోబాటులో ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఘటన ప్రపంచంలో రికార్డ్ సృష్టిస్తోంది. ప్రపంచంలో ఎటువంటి వ్యాధినైనా నయం చేయడానికి ఎన్నో కొత్త మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. వైద్య శాస్త్రం కూడా ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే.. అమెరికాలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు ఆపరేషన్ చేసి విజయవంతంగా బిడ్డను బయటకు తీసి అద్భుతం సృష్టించారు డాక్టర్లు. అమెరికాలోని నెబ్రస్కా ప్రాంతంలో ఉంటున్న కార్ల పిరేజ్ చిన్నతనం నుంచే మెదడు వ్యాధితో బాధపడుతోంది. ఆమె 6 నెలల గర్భవతిగా ఉన్న సమయంతో ఒక్కసారిగా తల తిరిగి కిందపడిపోయింది. కార్ల బ్రెయిన్ డెడ్ కావడం తో వెంటిలేటర్ మీద ఉంచారు. 54 రోజుల తర్వాత కార్ల కడుపులో ఉన్న బిడ్డను మాత్రం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తర్వాత కార్ల మరణించింది. బిడ్డ పుట్టినప్పుడు 1.3 కేజీల బరువు ఉందని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు.  మొత్తానికి బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కడుపులోంచి బిడ్డను బయటకు తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు డాక్లర్లు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brain dead  pregnent  delivery  Waterloo  Omaha  Nebraska  

Other Articles